ఢిల్లీలో కరోనా కల్లోలం : ఉమ్మి గొడవ..ఒకరు మృతి

  • Published By: madhu ,Published On : June 12, 2020 / 05:21 AM IST
ఢిల్లీలో కరోనా కల్లోలం : ఉమ్మి గొడవ..ఒకరు మృతి

కరోనా వైరస్ తో మృతి చెందుతుంటే..దీని కారణంగా కొంతమంది ఘర్షణ పడి ప్రాణాలు తీస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తున్నాయి. శానిటైజర్ వాడాలని, మాస్క్ కంపల్సరీ అని సూచిస్తున్నాయి.

లేనిపక్షంలో ఫైన్ వేసేందుకు కూడా వెనుకాడడం లేదు. అంతేగాకుండా…బహిరంగ ప్రదేశాల్లో రోడ్డు మీద ఉమ్మేయడం నేరంగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలా మంది ఈ నిబంధనలు కొంతమంది అతిక్రమిస్తున్నారు. ఉమ్మి వేయవద్దని చెప్పినందుకు జరిగిన ఘర్షణలో ఓ యువకుడి ప్రాణం పోయింది. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. 

మందిర్ మార్గ్ ఏరియాలో అంకిత్ అనే వ్యక్తి రోడ్డుపై ఉమ్మివేశాడు. అక్కడనే ఉన్న ప్రవీణ్ వారించాడు. కరోనా విస్తరిస్తున్న క్రమంలో ఇలా చేయడం సరికాదని సూచించారు. దీంతో ఇరువురి మధ్య మాటమాట పెరిగింది. గొడవ కాస్త పెరిగి పెద్దదైంది. కొట్టుకొనే వరకు వచ్చింది. ఈ విషయం పోలీసులకు తెలిసిందే.

అక్కడకు చేరుకొనే సరికి..రక్తపు మడుగులో ఇద్దరు పడి ఉన్నారు. వీరిని RML ఆసుపత్రికి తరలించగా…తీవ్రగాయాలతో అంకిత్ మరణించాడు. ప్రవీణ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read: విగ్గుతో అమ్మాయిలను ముగ్గులోకి దింపి.. ఫేస్‌బుక్‌లో పరిచయమై దోచేస్తాడు