జయరాం హత్య కేసులో మరో మలుపు : ఇద్దరు పోలీసులపై వేటు

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మరికొందరు పేర్లు బయటికి వచ్చాయి.

  • Published By: veegamteam ,Published On : February 23, 2019 / 01:31 AM IST
జయరాం హత్య కేసులో మరో మలుపు : ఇద్దరు పోలీసులపై వేటు

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మరికొందరు పేర్లు బయటికి వచ్చాయి.

హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మరికొందరు పేర్లు బయటికి వచ్చాయి. హత్య జరిగాక రాకేష్‌రెడ్డి ఇంటికి అతడి ఫ్రెండ్స్ నాగా, వెంకటేష్‌, శంకర్‌, సింగ్‌ వచ్చారని పోలీసులు గుర్తించారు. పార్టీ చేసుకుందాం రమ్మని వారిని రాకేష్‌రెడ్డే ఫోన్ చేసి పిలిపించినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. అయితే రాకేష్‌రెడ్డి ఇంటికి వచ్చినవారు… హాల్‌లోని జయరాం డెడ్‌బాడీని చూసి పరారయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు.. వీరిని కూడా  విచారిస్తున్నారు.

రాకేష్‌రెడ్డితో లింకులు పెట్టుకున్న ఇద్దరు పోలీసు అధికారులపై వేటుపడింది. జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి, బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ గోవింద్‌రెడ్డిని సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ గోవింద్‌రెడ్డి గతంలో ఆదిభట్లలో పని చేసిన సమయంలో రాకేష్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు నెరిపినట్లు పోలీసుల అంతర్గత విచారణలో తేలింది.

మరోవైపు పోలీసుల విచారణలో రాకేష్‌రెడ్డి అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో అతడితో సంబంధాలు పెట్టుకుని చీకటి వ్యాపారాలు సాగించినవారి వెన్నులో వణుకుపుడుతోంది. ఎప్పుడు ఎవరిని పోలీసులు పిలుస్తారో, రాకేష్‌ ఇంకా ఎవరెవరి పేర్లు బయటపెడతాడోనని ఆందోళన చెందుతున్నారు.