Girl Sexually Assaulted: హైదరాబాద్‌లో దారుణం.. మరో మైనర్ బాలిక కిడ్నాప్, లైంగిక దాడి

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన మరువక ముందు హైదరాబాద్‌లో మరో బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం..

Girl Sexually Assaulted: హైదరాబాద్‌లో దారుణం.. మరో మైనర్ బాలిక కిడ్నాప్, లైంగిక దాడి

Girl Sexually Assaulted

Girl Sexually Assaulted: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన మరువక ముందు హైదరాబాద్‌లో మరో బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నెల 31న రాత్రి పది గంటల సమయంలో పహాడీ షరీఫ్‌కు చెందిన పదకొండేళ్ల బాలిక ఒంటరిగా తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది.

Pawan Kalyan As CM: పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి.. బీజేపీకి జనసేన అల్టిమేటమ్

ఆ సమయంలో అదే రూట్లో వెళ్తున్న క్యాబ్ డ్రైవర్ షేక్ కలీమ్ అలీ ఒంటరిగా ఉన్న బాలికను చూసి క్యాబ్ ఆపి, బాలికను ఎక్కడికి వెళ్లాలి అని అడిగాడు. తాను ఇంటికి వెళ్తున్నానని, క్యాబ్ ఎక్కేందుకు తన దగ్గర డబ్బులు లేవని చెప్పింది. డబ్బులు లేకున్నా, ఆమె ఇంటి దగ్గర దిగబెడతానని బాలికను నమ్మించి, కారు ఎక్కించుకున్నాడు. తర్వాత మార్గ మధ్యంలో కలీమ్ అలీ, తన స్నేహితుడైన మొహమ్మద్ లుక్మాన్ అహ్మద్‌ను కారులో ఎక్కించుకున్నాడు. అయితే, కారు బాలిక ఇంటివైపు కాకుండా, లుక్మాన్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై ఇధ్దరూ కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Liquor Delivery: పది నిమిషాల్లో మద్యం డెలివరీ.. ప్రారంభించిన హైదరాబాద్ సంస్థ

బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ తర్వాత మరుసటి రోజు ఉదయం బాలికను సుల్తాన్ షాహి ప్రాంతంలో వదిలిపెట్టారు. ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు బాలిక కనిపించింది. వెంటనే బాలికను భరోసా సెంటర్‌కు తరలించి, ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. తాజాగా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్టు చేశారు.