ఆర్టీసీ సమ్మె..గుండెపోటుతో చనిపోయిన డ్రైవర్

  • Published By: madhu ,Published On : November 20, 2019 / 05:21 AM IST
ఆర్టీసీ సమ్మె..గుండెపోటుతో చనిపోయిన డ్రైవర్

మరో ఆర్టీసీ కార్మికుడు చనిపోయాడు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట్‌ పట్టణంలో నివాసముంటోన్న యాకూబ్‌పాషా…. ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 2019, నవంబర్ 19వ తేదీ మంగళవారం టీవీలో ఆర్టీసీ వార్తను చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడి కుటుంబ సభ్యులు నర్సంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉందని, ఎంజీఎంకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడికి తరలిస్తుండగా…మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచాడు. గుండెపోటుతో అతడు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. 

మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టి సమ్మె 47 రోజులవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా.. అన్ని డిపోల దగ్గర కార్మికుల నిరసనలు కొనసాగిస్తున్నారు. రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రవాణా రంగంలో రూట్లను ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టం చెబుతుందో తెలపాలని పిటిషనర్‌ను కోరింది. నవంబర్ 20వ తేదీ బుధవారం విచారించనుంది ధర్మాసనం. అదే విధంగా.. కార్మికుల జీతాలు, ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ నెలకొంది. 
Read More : సెల్ ఫోన్ మాట్లాడుతూ..బస్సును నడిపిన తాత్కాలిక డ్రైవర్