పోలీసులకు మాత్రం ప్రైవేట్ లైఫ్ ఉండదా…ఎంజాయ్ మెంట్ ఉండొద్దా

  • Published By: chvmurthy ,Published On : February 29, 2020 / 10:20 AM IST
పోలీసులకు మాత్రం ప్రైవేట్ లైఫ్ ఉండదా…ఎంజాయ్ మెంట్ ఉండొద్దా

మూడు నెలల క్రితం వరకు  షాద్ నగర్ పేరు చెపితే దిశా హత్యాచారం..నిందితుల ఎన్ కౌంటర్ గుర్తుకు వచ్చేది. ఇప్పుడ షాద్ నగర్ పేరు చెపితే పోలీసుల డ్యాన్సులు గుర్తుకు వస్తున్నాయి. షాద్ నగర్ పోలీసులు మందేసి.. నాగిని డ్యాన్సులతో  చిందేసిన వీడియో ఒకటి ఇప్పుడు  సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోంది. ఈ వీడియో పై సైబరాబాద్ సీపీ సజ్జనార్  ఆగ్రహం వ్యక్తం చేస్తూ   నలుగురు కానిస్టేబుళ్లు , ఒక ఏ.ఎస్సైని సస్పెండ్ చేశారు. 

మొన్న సీఐ …నిన్న స్టేషన్‌ స్టాఫ్‌ ఇలా వరుసగా.. షాద్‌నగర్‌ పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ కూతురి వివాహ వేడుకలో  పోలీసులు ఇలా చిందులు వేస్తూ కనిపించారు.

ఫిబ్రవరి 23 ఆదివారంనాడు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సీఐ శ్రీధర్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు.  ఆ గెట్ టూగెదర్ లో పోలీసులు చిత్ర, విచిత్రంగా చేసిన డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  పోలీసులు చేసిన డ్యాన్సులు,నాగినీ స్టెప్ లు వైరల్ కావటంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ డ్యాన్స్ లపై  సైబరాబాద్ సీపీ సజ్జనార్  ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాద్‌నగర్‌ సీఐ శ్రీధర్‌ను బదిలీ చేస్తూ…హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు. ఇక ఈ ఘటనపై విచారణ జరపాలని , ఏం జరిగిందో నివేదిక అందించాలని సీపీ సజ్జనార్ షాద్‌నగర్‌ ఏసీపీని ఆదేశించారు. 

ఆ ఘటన మరువక ముందే వారం రోజుల్లో మరోక  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్తూరు పోలీస్ స్టేషన్లోనే విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ అనే కానిస్టేబుల్ కూతురు వివాహం ఫరూఖ్ నగర్ మండలంలోని రామేశ్వరం దేవాలయం సమీపంలో జరిగింది.

అక్కడికి దగ్గరలో ఉన్న ఒక వెంచర్లో కొత్తూరు పోలీస్ స్టేషన్ కు చెందిన  పోలీసులు  పెళ్లి సందర్భంగా మందు పార్టీ నిర్వహించుకొని మద్యం సేవించిన తర్వాత ఏఎస్ఐ బాలస్వామి,హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, అశోక్ రెడ్డి అమరనాథ్ రెడ్డి ,రామకృష్ణ రెడ్డి చంద్ర మౌళి తో పాటు మరికొంత పోలీస్ సిబ్బంది నాగిని డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో లో వైరల్ అవుతుంది.  

ఇలా పోలీసులు వీడియోలు సోషల్ మీడియాలోవైరల్ అవటంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో బహిరంగ ప్రదేశంలో పోలీసులు మద్యం సేవించిన కారణంతో అయిదుగురు సిబ్బందిని  సీపీ ఆఫీసుకు ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు  జారీ చేశారు.

పోలీస్ శాఖలోనే గ్రూప్ తగాదాల వల్లే… శత్రువర్గం వారు వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారనే టాక్  వినపడుతోంది.  ఏది ఏమైనా పోలీసులు వ్యక్తగత దావత్ లు  కూడా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయనేది మరోక వర్గం వాదిస్తోంది. 

See Also | విమానంలో హల్ చల్ చేసిన పావురం.. వీడియో వైరల్