Poison Cocaine : 20మంది ప్రాణాలు తీసిన కల్తీ కొకైన్..ప్రాణాపాయంలో మరో 75 మంది

కల్తీ కొకైన్ తీసుకున్న 20మంది చనిపోయారు. మరో 75మందికి పైగా పాణాపాయంలో ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొకైన్ లో విషపదార్ధాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం

Poison Cocaine : 20మంది ప్రాణాలు తీసిన కల్తీ కొకైన్..ప్రాణాపాయంలో మరో 75 మంది

Poison Cocaine

Poison Cocaine : కొకైన్ మత్తులో పడేయటమే కాదు ప్రాణహానికూడా. అటువంటిది కొకైన్ కల్తీ అయితే..దాని తీసుకున్నవారి పరిస్థితి ఇదిగో ఇలాగే ఉంటుంది. కల్తీ అయిన కొకైన్ తీసుకున్న 20మంది ప్రాణాలు కోల్పోయారు మరో 75మందికి పైగా ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న దారుణ ఘటన అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో జరిగింది. విషపదార్ధాలు కలిసిన కొకైన్‌ తీసుకున్న 20మంది మరణించగా మరో 75మందికి పైగా ప్రాణాలతో పోరాడతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. బ్యూనస్‌ ఎయిర్స్‌ ప్రావిన్స్‌లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది పట్టణాల్లో విష పదార్థాలు కలిసిన కొకైన్‌ను తీసుకోవడంతో ఇప్పటివరకు 20 మంది రణించారని అధికారులు తెలిపారు.

Also read : Money Laundering : డొల్ల కంపెనీలతో మనీ లాండరింగ్‌కు పాల్పడిన చైనా కంపెనీలు

మరో 75మంది తీవ్ర అస్వస్థతకు గురి కాగా వీరిని హాస్పిటల్స్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. కానీ వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బ్యూనస్‌ ఎయిర్స్‌ ప్రావిన్స్‌ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం బాగా ఉంది. డ్రగ్స్ అమ్మకాల్లో సదరు ముఠాల మధ్య పోటీ కూడా ఉంటుంది. దీంతో ఈ ముఠాలకు ఘర్షణలు కూడా జరుగుతుంటాయి. డ్రగ్స్ ముఠాల మధ్య ఘర్షణలు జరుగుతున్న క్రమంలో ఉద్దేశపూర్వకంగానే మాదకద్రవ్యాలను కల్తీ చేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. మరింత ప్రాణనష్టం జరగకుండా పలు ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కొకైన్‌ తీసుకున్నవారి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు పోలీసులు. ల్యాబ్‌ నుంచి వచ్చే రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నామని ఈ రిపోర్టులు వచ్చాక కొకైన్ లో ఏమేమి కలిపి ఉంటారో తెలుస్తుందని ప్రావిన్షియల్‌ సెక్యూరిటీ మినిస్టర్‌ సెర్జియో బెర్నీ తెలిపారు. ఈ ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. కల్తీ కొకైన్‌ తీసుకోవడంతో హర్లింగ్‌హామ్, శాన్ మార్టిన్, ట్రెస్ డి ఫెబ్రెరో పట్టణాల్లోనే ఎక్కువ మరణాలు సంభవించాయని వెల్లడించారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

Also read : Kerala CM Viral‌ tweet : మలయాళంలో దుబాయ్‌ ప్రధాని ట్వీట్..అరబిక్ లో స్పందించిన కేరళ సీఎం

కాగా డ్రగ్స్ ముఠాలు చట్టవిరుద్ధమైన ఈ మాదక ద్రవ్యాన్ని విషం, ఇతర పదార్థాలతో కల్తీ చేసుంటారని దర్యాప్తు చేస్తున్న అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. డ్రగ్స్ తీసుకునేవారు ఎవరైనా గత 24 గంటల్లో కొకైన్ కొనుగోలు చేసుంటే, దానిని పారేయాలని బ్యూనస్‌ఎయిర్స్‌ రక్షణ మంత్రి ప్రజలకు సూచించారు.

కాగా మృతి చెందినవారితో పాటు అస్వస్థతకు గురైనవారు దేశ రాజధాని ప్రాంతానికి చెందిన హర్లింఘామ్, ట్రెస్ డీ ఫెబ్రేరో, శాన్ మార్టిన్ జిల్లాలకు చెందినవారు ఉన్నారని తెలిపారు. ఈ కల్తీ కొకైన్‌ ముఠాలను పట్టుకోవటానికి పోలీసులు ఎన్నో విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. పలు యత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ముఠాలు పోలీసులపై దాడులు చేయటానికి కూడా వెనుకాడటంలేదు. ఈ డ్రగ్స్ అస్వస్థత ఘటనపై బాధిత బంధువులు హర్లింఘామ్‌లో ఓ పోలీసు వాహనంపై దాడి చేశారు.

Also read : Covid-19 Update : దేశంలో నిన్న కొత్తగా 1,49,394 కోవిడ్ కేసులు నమోదు

డ్రగ్స్ వినియోగానికి సంబంధించి 2019లో విడుదలైన ఒక నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం..కొకైన్ వినియోగించే దేశాల్లో అమెరికా, ఉరుగ్వే తర్వాత అర్జెంటీనా మూడో స్థానంలో ఉండటం గమనించాల్సిన విషయం. మత్తు పధార్థాల కట్టడికి అర్జెంటీనా ఎన్ని చర్యలు చేసినా..వాటిని నిరంతరం కొనసాగిస్తున్నా డ్రగ్స్ ముఠాల ఆగడాలు మాత్రం కొనసాగుతునే ఉన్నాయి. దీంతో అక్కడ విచ్చలవిడిగా కొకైన్‌ వంటి మాదకద్రవ్యాలు అమ్మకాలు యదేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి.