ఉత్తరప్రదేశ్‌ పేలుళ్ల కేసు : హైదరాబాద్‌లో ఆర్మీ కెప్టెన్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌లో ఆర్మీ కెప్టెన్‌ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పేలుళ్లతో సంబంధం ఉందంటూ ఆర్మీ కెప్టెన్ అశ్వక్ ఆలమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Published By: veegamteam ,Published On : November 15, 2019 / 08:02 AM IST
ఉత్తరప్రదేశ్‌ పేలుళ్ల కేసు : హైదరాబాద్‌లో ఆర్మీ కెప్టెన్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌లో ఆర్మీ కెప్టెన్‌ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పేలుళ్లతో సంబంధం ఉందంటూ ఆర్మీ కెప్టెన్ అశ్వక్ ఆలమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో ఆర్మీ కెప్టెన్‌ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ పేలుళ్లతో సంబంధం ఉందంటూ… హైదరాబాద్‌లో ఆర్మీ కెప్టెన్ అశ్వక్ ఆలమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో డాక్టర్‌‌గా చేస్తున్న అశ్వక్… యూపీలో పేలుళ్ల తర్వాత ఇక్కడకు వచ్చాడు.

ఈ కేసు విషయంలో అశ్వక్‌ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు యూపీకి తరలించారు. యూపీలోని ఖుషీ నగర్ బాంబు పేలుళ్లు జరిగినప్పుడు అశ్వక్ అక్కడే ఉన్నట్లు గుర్తించారు. అయితే సాక్ష్యాలను తారుమారు చేశారని ప్రధానంగా అతనిపై ఆరోపణ ఉంది. పేలుళ్ల తర్వాత హైదరాబాద్ కు వచ్చినట్లు ఫోన్ కాల్స్ ద్వారా గుర్తించారు.

యూపీ యాంటి టెర్రరిస్టు స్క్వాడ్ అధికారుల ఆధీనంలో అశ్వక్ ఉన్నారు. అతనిపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారితో అతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇంకా ఏమైనా పేలుళ్లకు కుట్ర పన్నారా.. అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

ఎన్ఐఏ అధికారులు, యూపీ యాంటి టెర్రరిస్టు స్క్వాడ్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టి.. కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది.