పెంపుడు కుక్కను బతికించి..ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్

  • Published By: madhu ,Published On : March 1, 2020 / 08:26 AM IST
పెంపుడు కుక్కను బతికించి..ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్

కుక్కను ప్రాణప్రదంగా పెంచుకున్నాడు ఓ ఆర్మీ ఆఫీసర్. ఎంతో అప్యాయంగా చూసుకున్నాడు. దానికి ఏదైనా కష్టం వస్తే..తనకు కష్టం వచ్చేలా ఫీలయ్యేవాడు. ఆ ఇంట్లోకి అపరిచిత వ్యక్తులను రానిచ్చేది కాదు. అంతగా అపురూపంగా ప్రేమించుకున్న కుక్క ప్రమాదంలో ఉంటే..ఆ ఆర్మీ ఆఫీసర్ ఏం చేస్తాడు. రక్షించే ప్రయత్నం చేస్తాడు..అంటారు..కదా..కానీ..ఆర్మీ ఆఫీసర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పెంపుడు కుక్కను బతికించి..ఆర్మీ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలిచివేసింది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే…
కాశ్మీర్ ప్రాంతానికి చెందిన అంకిత్ బుద్రజా..గుల్ మర్గ్ SSTC మిలటరీ క్యాంపెయిన్‌లో మేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయన రెండు కుక్కలను పెంచుకుంటున్నాడు. వీటిని చక్కగా పెంచుకుంటున్నాడు. కానీ..ఫిబ్రవరి 29వ తేదీ శనివారం అంకిత్ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన అంకింత్ ఇంట్లో ఉన్న వారందరినీ సురక్షితంగ బయటకు తీసుకొచ్చారు.

దాంతో పాటు కుక్కలను కూడా తీసుకొచ్చాడు. రెండు కుక్కలను తీసుకొచ్చాడని అనుకున్నాడు. కానీ ఒక కుక్కను మాత్రమే తీసుకొచ్చాడు. మరో కుక్క లోపలే ఉండిపోయింది. దానిని రక్షిద్దామని లోనికి వెళ్లాడు. కుక్కను సేఫ్‌గా బయటకు పంపించాడు. అంకిత్ మాత్రం లోపలే ఉండిపోయాడు. మంటలు అంటుకుని విలవిలాడిపోయాడు. సుమారు 90 శాతం కాలిన గాయాలయ్యాయి. అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు..ఘటనాస్థలికి చేరుకున్నారు. అంకిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం..తాన్ మార్గ్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. 
Read More : షిల్లాంగ్‌లో CAA నిరసనలు..ఇద్దరు మృతి