Girl sale : 3 ఏళ్ల చిన్నారిని అమ్మేసిన తండ్రి..9 ఏళ్లకు త‌ల్లి దగ్గరకు చేర్చిన పోలీసులు

3 ఏళ్ల చిన్నారిని రూ.లక్షకు అమ్మేసిన తండ్రి..9 ఏళ్లకు త‌ల్లి దగ్గరకు చేర్చిన పోలీసులు.

Girl sale : 3 ఏళ్ల చిన్నారిని అమ్మేసిన తండ్రి..9 ఏళ్లకు త‌ల్లి దగ్గరకు చేర్చిన పోలీసులు

Girl Sale

Girl sale : తండ్రి చేసిన దర్మార్గానికి పాల్పడి మూడేళ్ల కన్న కూతుర్ని అమ్మేసినా..ఆ బిడ్డ తిరిగి తిరిగి తల్లి వద్దకు చేరుకుంది. తొమ్మిదేళ్లుగా కన్నబిడ్డ కోసం అల్లాడిపోయిన తల్లి బిడ్డ కోసం ఏడవని రోజు లేదు. కట్టుకున్న భర్తే తన కడుపులో చిచ్చు పెట్టాడని తెలిసి కుమిలిపోయింది. బిడ్డ కోసం అల్లాడిపోయింది. దేవుడు కరుణించాడో ఏమో..తల్లీ బిడ్డల్ని కలిపాడు. ఊహ తెలియని వయస్సులో తల్లికి దూరమైన ఆ బిడ్డ..మూడేళ్ల చిట్టితల్లిని పోగొట్టుకున్న ఆ తల్లి తనివితీరా కౌగలించుకున్నాడు. తొమ్మిదేళ్లుగా బిడ్డ కోసం ఏడ్చిన ఆ తల్లి గుండె శాంతించింది. పోలీసుల రూపంలో ఆమె కడుపు కోత చల్లారింది.బిడ్డ బతికి ఉందో లేదో తెలియక తల్లడిల్లిపోయిన ఆ మాతృహృదయంలో అమృతం కురిపించారు పోలీసులు.

తొమ్మిదేండ్ల కింద‌ట అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో అమ్మేసిన 12 ఏళ్ల బాలికను అసోంకు చెందిన విశ్వ‌నాధ్ జిల్లా పోలీసులు కాపాడి త‌ల్లి సీమా ఖ‌రియా చెంత‌కు చేర్చారు. మూడేళ్ల వ‌య‌సులో ఓ మ‌హిళ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన కుటుంబానికి రూ ల‌క్ష‌కు విక్ర‌యించింది. విశ్వ‌నాధ్ జిల్లా గోలియ న‌బాపూర్ ప్రాంతానికి చెందిన బాలిక తండ్రి బిడ్డను పెంచలేక స్ధానికంగా ఉండే రోమిలా అనే మ‌హిళ‌కు అప్ప‌గించాడు. రోమిలా ఆ చిన్నారిని రూ. ల‌క్ష‌కు అమ్మేసింది.

బిడ్డ కనిపించకపోవటంతో ఏమైందోనని తల్లిడిల్లిపోయిన ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీనిపై కేసు న‌మోదు చేసిన విశ్వ‌నాధ్ జిల్లా పోలీసులు పలు విధాలుగా చిన్నారి కోసం గాలించారు. ప్రకటనలు ఇచ్చారు. కానీ ఫలితం లేదు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే రోమిలాపై పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌గా బాలిక‌ను అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ఓ కుటుంబానికి రూ ల‌క్ష‌కు అమ్మానని చెప్పింది.

దీంతో అసోం పోలీసులు వెంటనే అరుణాచ‌ల్ ప్రదేశ్ పోలీసుల‌ను సంప్ర‌దించ‌గా వారు న‌హ‌ర్లాగాం ప్రాంతం నుంచి బాలిక‌ను కాపాడారు. ఆ బాలికను తల్లి దగ్గరక చేయటానికి తొమ్మిదేళ్లు కష్టపడ్డారు. తల్లి వద్దకు చేర్చారు. ఊహతెలియని వయస్సులో అమ్మేయబడిని ఆ చిన్నారి తల్లి చెంతకు చేరినా అమ్మను గర్తు పట్టలేదు. తరువాత తరువాత త‌ల్లిని గుర్తుప‌ట్ట‌టానికి ఆ తల్లి ఎన్నో విధాలుగా యత్నాలు చేసింది. అలా చిట్టచివరకు తల్లి బిడ్డలు ఒక్కటయ్యారు.