అసలేం జరిగింది : అమెజాన్ ఉద్యోగిపై దాడి

హైదరాబాద్ నగరంలోని అమెజాన్ కంపెనీలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఓ ఉద్యోగి సహచర ఉద్యోగిపై దాడి చేశాడు. ఆఫీస్ లోనే ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితుడు

  • Published By: veegamteam ,Published On : December 5, 2019 / 03:05 PM IST
అసలేం జరిగింది : అమెజాన్ ఉద్యోగిపై దాడి

హైదరాబాద్ నగరంలోని అమెజాన్ కంపెనీలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఓ ఉద్యోగి సహచర ఉద్యోగిపై దాడి చేశాడు. ఆఫీస్ లోనే ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితుడు

హైదరాబాద్ నగరంలోని అమెజాన్ కంపెనీలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఓ ఉద్యోగి సహచర ఉద్యోగిపై దాడి చేశాడు. ఆఫీస్ లోనే ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కార్యాలయంలోనే ఘర్షణ జరగడంతో దీనిపై స్పందించిన యాజమాన్యం విచారణ జరిపి దాడికి పాల్పడిన ఉద్యోగిపై చర్యలు తీసుకుంది. అతడిని విధుల నుంచి తొలగించింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల చేశారు. అమెజాన్ టోలిచౌకి బ్రాంచ్‌‌లో ఈ ఘటన జరిగింది. నవంబర్ 20న ఆఫీసులో గొడవ జరిగింది. తనపై అకారణంగా దాడి చేశాడని బాధితుడు వాపోయాడు. 

ఆఫీస్ లోనే ఉద్యోగిపై దాడి ఘటన కలకలం రేపింది. తోటి ఉద్యోగులు షాక్ కి గురయ్యారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తన సీటులో కూర్చుని తన పని చేసుకుంటున్న ఉద్యోగిపై సహచర ఉద్యోగి దాడికి పాల్పడ్డాడు. అతడిని ఇష్టానుసారం కొట్టాడు. ఇది గమనించిన సహచరుడు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా.. అతడు ఊరుకోలేదు. తీవ్రంగా కొట్టాడు. ఇంతలో ఇతరు సిబ్బంది కూడా వచ్చి దాడి చేస్తున్న ఉద్యోగిని దూరంగా తీసుకెళ్లారు.

తన అన్న శివరామ్ పై మునీర్ అకారణంగా దాడి చేశాడని బాధితుడి సోదరి వాపోయింది. దాడిలో తన అన్న తలకు తీవ్ర గాయమైందని, ఆపరేషన్ చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పారని ఆమె తెలిపింది. దాడి చేసిన మునీర్, అమెజాన్ ఆఫీస్ పై గోల్కొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. ఇంత పెద్ద గొడవ జరిగినా.. పరువు పోతుందనే భయంతో అమెజాన్ మేనేజ్ మెంట్ తమకు విషయం చెప్పలేదని శివరామ్ సోదరి ఆవేదన వ్యక్తం చేసింది. విషయాన్ని గోప్యంగా ఉంచినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.