గురుద్వారపై కాల్పులకు తెగబడిన ఐసిస్…11మంది మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : March 25, 2020 / 09:50 AM IST
గురుద్వారపై కాల్పులకు తెగబడిన ఐసిస్…11మంది మృతి

ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్(COVID-19)భయంతో వణికిపోతున్న సమయంలో ఐసిస్ మాత్రం తన ఉగ్రకార్యకలాపాలను యధేచ్చగా కొనసాగిస్తూనే ఉంది. ఆఫ్గ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌ లోని గురుద్వారా సాహిబ్ పై ఇవాళ(మార్చి-25,2020) ఓ ఉగ్ర‌వాది విచ‌క్ష‌ణార‌హితంగా జ‌రిపిన కాల్పుల్లో 11మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక గురుద్వారాలో ప్రార్థ‌న‌ల కోసం గుమికూడిన సిక్కుల‌పై ఆగంత‌కుడు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు.

కాల్పులకు తెలబడింది తామేనని ISIS ప్రకటించుకుంది. ఆఫ్గాన్‌లో సిక్కులు మైనారిటీ వ‌ర్గం. వీరిపై త‌రుచూ ఉగ్ర‌వాద మూక‌లు దాడుల‌కు తెగ‌బ‌డుతున్నాయి.  హిందువులు, సిక్కుల వంటి మైనారిటీల‌పై ఉగ్ర‌దాడులు పెరుగుతుండ‌టంతో ఆయా వ‌ర్గాలు భార‌త్‌లో ఆశ్ర‌యం కోరుతున్నాయి. మరోవైపు ఆఫ్గాన్ లో గురుద్వారపై దాడిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరముందని,కొన్ని దేశాల్లో మైనార్టీల వేధింపులు,దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఈ మరణాలు గుర్తుచేస్తున్నాయని,మతపరమైన స్వేఛ్ఛ కాపాడబడాలని,ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత విమానయానశాఖ మంత్రి హఱ్ దీప్ సింగ్ పూరి తెలిపారు.

కాబూల్ లోని గురుద్వారాపై దాడిని తీవ్రంగా కండిస్తున్నట్లు భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని రవీష్ కుమార్ తెలిపారు. ఈ ఉగ్రదాడిలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి సమయంలో మైనార్టీ కమ్యూనిటీకి చెందిన ప్రార్థనా స్థలాలపై కాల్పులకు తెగబడటం వారి క్రూరమైన మనస్థత్వన్ని ప్రతిబింబిస్తుందని రవీష్ అన్నారు. ఆఫ్గనిస్తాన్ లోని హిందూ,సిక్కు కమ్యూనిటీకి చెందిన బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాలుగా సాయమందించేందు భారత్ సిద్ధంగా ఉందని రవీష్ అన్నారు.

Also Read |  ఐసోలేషన్ యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో Co-Watching. స్నేహితులతో కలసి మూవీస్‌ను వాచ్ చేయొచ్చు