Aunt Killed Children : దారుణం.. పిల్లలను చంపి, ఏడాది పాటు కారులో తిప్పింది..

అమెరికాలో దారుణం జరిగింది. ఓ మహిళ అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాలను సూట్ కేసులో కుక్కింది. వాటిని కారు డిక్కీలో పెట్టుకుని ఏడాది పాటు చక్కర్లు కొట్టింది. చివరికి

Aunt Killed Children : దారుణం.. పిల్లలను చంపి, ఏడాది పాటు కారులో తిప్పింది..

Aunt Killed Children

Aunt Killed Children : అమెరికాలో దారుణం జరిగింది. ఓ మహిళ అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాలను సూట్ కేసులో కుక్కింది. వాటిని కారు డిక్కీలో పెట్టుకుని ఏడాది పాటు చక్కర్లు కొట్టింది. చివరికి పోలీసులు జరిపిన తనిఖీల్లో ఈ ఘోరం వెలుగుచూసింది.

ఆమె పేరు నికోల్ జాన్సన్. వయసు 33ఏళ్లు. బాల్టిమోర్ లో నివాసం ఉంటుంది. ఆమె ఇద్దరు పిల్లలకు కేర్ టేకర్ గా ఉంది. బాబు వయసు ఏడేళ్లు. పాప వయసు ఐదేళ్లు. పిల్లల తల్లి వారిని చూసుకునే పరిస్థితిలో లేదు. దీంతో పిల్లల సంరక్షణ బాధ్యతను వారి ఆంటీ నికోల్ జాన్సన్ కు అప్పగించారు. ఏం జరిగిందో ఏమో కానీ, సడెన్ గా ఆంటీ నికోల్ దారుణానికి ఒడిగట్టింది. ఇద్దరు పిల్లలను చంపేసింది. అంతేకాదు వారి డెడ్ బాడీలు సూట్ కేసులో కుక్కి కారు డిక్కీలో ఉంచింది. అలానే ఏడాది పాటు తిరిగింది.

కాగా, ఎసెక్స్ ప్రాంతంలో పోలీసులు తనఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో నికోల్ తన కారులో అక్కడికి వచ్చింది. పోలీసులు ఆమెను ఆపారు. కారు చెక్ చేయాలని చెప్పారు. అయితే నికోల్ ప్రవర్తన చూసి వారికి అనుమానం కలిగింది. కారు డిక్కీ ఓపెన్ చేసి చూడగా బ్యాగ్ కనిపించింది. అంతేకాదు బాగా దుర్వాసన వస్తోంది. దీంతో పోలీసులు వెంటనే బ్యాగ్ ఓపెన్ చూసి చూశారు. అంతే ఒక్కసారిగా షాక్ తిన్నారు. అందులో రెండు డెడ్ బాడీలు ఉన్నాయి. బాగా కుళ్లిపోయి ఉన్నాయి. దుర్వాసన వస్తున్నాయి.

పోలీసులు నికోల్ ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించారు. నికోల్ షాకింగ్ విషయాలు చెప్పింది. ఆ పిల్లలకు తాను ఆంటీ అవుతాయని, వారిద్దరిని తానే చంపేశానని అంగీకరించింది. గత మార్చిలో తన పిల్లలను తిరిగి తన దగ్గరికి తీసుకురావాలని వారి తల్లి నికోల్ ను కోరింది. అయితే నికోల్ వారిద్దరిని చంపేసింది. ఏడాది క్రితమే వారిద్దరని నికోల్ చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టిందో తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.