Aunt, Nephew Love Affair : మేనత్తతో అల్లుడి ప్రేమాయణం..ఫలితం ఆర్నెల్ల గర్భవతి….

ప్రేమ అనేది ఇద్దరు మనుషుల మధ్య ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేము. ప్రేమకు వయస్సు అడ్డుకాదని చెప్పే సినిమా డైలాగులు చాలా ఉన్నాయి.

Aunt, Nephew Love Affair : మేనత్తతో అల్లుడి ప్రేమాయణం..ఫలితం ఆర్నెల్ల గర్భవతి….

Aunt, Nephew Love Affair

Aunt, Nephew Love Affair : ప్రేమ అనేది ఇద్దరు మనుషుల మధ్య ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేము. ప్రేమకు వయస్సు అడ్డుకాదని చెప్పే సినిమా డైలాగులు చాలా ఉన్నాయి. ఇటీవలి కాలంలో వావి,వరసలు కూడా మరిచి ప్రేమలో పడిపోతున్నారు. పురాణాల్లో కెళితే తనకన్నా పెద్దదైన మేనత్త రాధను ప్రేమించిన కృష్ణుడు.. ఆమె మోహంలో పడిపోతాడు. వారిద్దరి ప్రేమను ప్రపంచంలోనే అపురూపమైన ప్రేమ బంధంగా కవులు వర్ణిస్తారు.

కానీ అలాంటి ప్రేమ నేటి ఆధునిక కాలంలో జరిగితే పెద్దలు ఒప్పుకోరు. ఇలాంటి ఘటనే ఇటీవల మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. చివరికి ఆ జంట ఆత్సేమహత్య చేసుకునేలా చేసింది. మధ్యప్రదేశ్ లోని, సిథీ జిల్లాలోని సిహావల్ మండలంలోని ఒక యువకుడు ప్రేమ వ్యామోహంలో పడి   వయస్సు, వరుస మర్చిపోయి తన కంటే వయస్సులో పెద్దదైన తన మేనత్తను ప్రేమించాడు. ఆమె కూడా మేనల్లుడ్ని ఇష్టపడింది.

ఇద్దరి మధ్య దాదాపు ఏడాది పాటు ప్రేమాయణం  కొనసాగింది. కొన్నిసార్లు సన్నిహితంగా మెలిగారు. ఫలితంగా అత్త గర్భం దాల్చింది. ఆమెకు ఆరోనెల వచ్చేసరికి  శరీరంలో వస్తున్న మార్పుల కారణంగా అత్తా, అల్లుళ్ల ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్లకు తెలిసిపోయింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంట్లోవాళ్లు వీరి ప్రేమను అంగీకరించలేదు.

అబ్బాయిని ఇంటికి పిలిచి మంచిగా చెప్పి చూశారు. తమ శక్తికి మించి వారి బంధం గురించి విడమరిచి చెప్పారు. ఆధునిక సమాజం వీరి బంధాన్ని ఒప్పుకోదని ఎవరిదారి వారు చూసుకోండని నచ్చచెప్పారు. అయినా వారు వినలేదు. గత శుక్రవారం మళ్లీ యువకుడిని  పిలిచి మళ్లీ పెద్దలు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వారు చెప్పినదంతా విన్నయువకుడు మౌనంగా ఉండిపోయాడు.

శుక్రవారం రాత్రి ఇద్దరూ కల్సి ఇంట్లోంచి పారిపోయారు. సమీపంలో ఉన్న సోన్ నది వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మర్నాడు వంతెనపై నుంచి వెళుతున్నవారు నదిలో ఇసుక తిన్నెలపై పడి ఉన్నవారిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు వారిని అమేలియా లోని  ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రేమ జంట కన్నుమూసింది. దీంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయు.