అత్త అక్రమ సంబంధం-ఆమె ప్రియుడి బెదిరింపులతో అల్లుడు ఆత్మహత్య

అత్త అక్రమ సంబంధం-ఆమె ప్రియుడి బెదిరింపులతో అల్లుడు ఆత్మహత్య

aunty illegal affair, son in law end life : కూతుర్నిచ్చి పెళ్లి చేసిన అత్తగారు వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అది నచ్చని అల్లుడు భార్యముందు అభ్యంతరం వ్యక్త పరిచాడు. భార్యా తన తల్లికే మద్దతు తెలిపి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అత్త, ఆమె ప్రియుడు బెదిరించటం మొదలెట్టేసరికి అల్లుడు అత్మహత్యచేసుకున్నాడు.

నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తుటిపేట తండాకు చెందిన అంగోతు రాము పెద్ద కొడుకు అంగోతు బాబు(25) కి, చందంపేట మండలం తెల్దార్‌పల్లి ప్రాంతానికి చెందిన యువతితో 8 నెలల క్రితం వివాహమైంది. పెళ్లైన తర్వాత కొత్త దంపతులిద్దరూ హైదరాబాద్ కు వచ్చి కర్మన్ ఘాట్ నందనవనం శ్రీరమణ కాలనీలో నివాసం ఉంటున్నారు.

బాబు క్యాబ్ డ్రైవర్ గా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈక్రమంలో బాబు అత్త విజయ, శ్రీను అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆవిషయం తెలిసిన బాబు, తన భార్య వద్ద అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అత్త ప్రవర్తన వల్ల భార్యా భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్యతో పాటు అత్త, ఆమె ప్రియుడు శ్రీను కూడా బాబును దూషించటం, బెదిరించటం చేయసాగారు.

ఈ విషయం తెలుసుకున్న బాబు తండ్రి రాములు….బాబు అత్త,ఆమె ప్రియుడు, కోడలికి పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా భార్య, అత్త ప్రవర్తనలో మార్పురాలేదు. పది మందిలో అల్లుడు కుటుంబ పరువు తీసాడని అత్త అల్లుడి మీద కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో బాబు భార్య కూడా మొగుడ్ని విడిచి పెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది.

ఇటీవల అత్తతో సన్నిహితంగా ఉండే శ్రీను, బాబుకు ఫోన్ చేసి బెదిరించాడు. మంగళవారం ఉదయం బాబు  తమ్ముడు జబ్బార్ ఆటో తీసుకుని బయటకు వెళ్లాడు. బాబు ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జబ్బార్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా బాబు ఉరివేసుకుని కనిపించాడు.

వెంటనే తండ్రికి సమాచారం ఇచ్చాడు. బాబు అత్తతో సన్నిహితంగా ఉండే శ్రీను బెదిరించటం వల్లే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని బాబు తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.