అధికారుల వేధింపులపై వీడియో:పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ASI మృతి 

  • Published By: veegamteam ,Published On : December 2, 2019 / 10:40 AM IST
అధికారుల వేధింపులపై వీడియో:పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ASI మృతి 

బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు  పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ASI  నర్శింహా మృతి చెందారు.సీఐ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిటన్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వేధింపులు భరించలేని నర్శింహా పోలీస్ స్టేషన్ ముందే నవంబర్ 22న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన నర్శింహా కంచన్ బాగ్ ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

60 శాతానికి పైగా కాలిన గాయాలతో  చికిత్స పొందుతూ నర్శింహా మృతితో  హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు..బంధువులు ఆందోళన చేపట్టారు. సీఐ వేధింపుల వల్లనే నర్శింహ ఆత్మహత్యకు పాల్పడ్డాడనీ..దీనికి  కారణమైనవారిపై మర్డర్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని..తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.  

కాగా నర్శింహ ఆత్మహత్యకు కారణ మనే అనుమానాలకు దారి తీస్తోంది. నర్శింహ కుమారుడు సాయి కిరణ్ బావమరిది వివాహ వేడుక బాలాపూర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఫంక్షన్ హాల్ వద్దకు బాలాపూర్ పెట్రోలింగ్ వాహనంలో కొందరు కానిస్టేబుల్స్ వచ్చి హారన్ కొట్టారు. దీంతో సాయికిరణ్ బైటకు వచ్చి వారిని ఏంటీ ఇలా వచ్చారు? అని అడిగారు.దానికి వారు రూ.3వేలు ఇవ్వాలని లేకుంటా పెళ్లి వేడుకల్ని నిలివేస్తామని బెదిరించారు. దానికి సాయి కిరణ్ మా నాన్న నర్శింహ కూడా ఏఎస్సైగా పనిచేస్తున్నారనీ చెప్పాడు. దానికివారు దురుసుగా మాట్లాడుతూ..మీ నాన్న ఏఎస్సై అయితే మాకేంటీ ఎవ్వరైనా సరే డబ్బులు ఇవ్వాల్సిందేనని వాగ్వాదానికి దిగారు. ఈ విషయాన్ని సాయి కిరణ్ లోపలికి వెళ్లి తన తండ్రితో చెప్పాడు. ఒకే స్టేషన్ లో పనిచేస్తున్నా తాను ఎవరో తెలీదని మాట్లాడిన కానిస్టేబుల్స్ వద్దకు వెళ్లి  అడగగా..డబ్బులు ఇవ్వమని మరోసారి సదరు కానిస్టేబుల్స్ అడిగారు. దీంతో నర్శింహాను డబ్బుల కోసం సీఐ వేధింపులు నిజమేననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

 కాగా..డబ్బుల కోసం తనను పై అధికారులు వేధిస్తున్నారనీ..ఆ వేధింపులు తాళలేక నర్శింహ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లుగా ఆరోణలు వచ్చిన విషయం తెలిసిందే. వేధింపులతో ఆత్మహత్యకు యత్నంచిన నర్శింహా సోమవారం (డిసెంబర్ 2)న మృతి చెందారు.