వీడే దొంగ : సుబ్బరామిరెడ్డి బంధువు ఇంట్లో చోరీ కేసులో కీలక ఆధారం

కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామి రెడ్డి బంధువు ఇంట్లో చోరీ కేసులో పోలీసులకు కీలక ఆధారం దొరికింది. సీసీ ఫుటేజీలో దొంగ దృశ్యాలు చిక్కాయి. ఓ వ్యక్తి ముఖానికి మాస్క్

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 10:58 AM IST
వీడే దొంగ : సుబ్బరామిరెడ్డి బంధువు ఇంట్లో చోరీ కేసులో కీలక ఆధారం

కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామి రెడ్డి బంధువు ఇంట్లో చోరీ కేసులో పోలీసులకు కీలక ఆధారం దొరికింది. సీసీ ఫుటేజీలో దొంగ దృశ్యాలు చిక్కాయి. ఓ వ్యక్తి ముఖానికి మాస్క్

కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామి రెడ్డి బంధువు ఇంట్లో చోరీ కేసులో పోలీసులకు కీలక ఆధారం దొరికింది. సీసీ ఫుటేజీలో దొంగ దృశ్యాలు చిక్కాయి. ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నాడు. ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. దొంగని పట్టుకునేందుకు 8 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సుబ్బరామి రెడ్డి అన్న కొడుకు ఉత్తమ్ రెడ్డి ఇంట్లో ఈ చోరీ జరిగింది. రూ.3కోట్ల విలువైన వజ్రాలు, బంగారం ఎత్తుకెళ్లాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్లాట్ నెంబర్ 91లో ఉత్తమ్ రెడ్డి నివాసం ఉంటున్నారు. మంగళవారం(ఆగస్టు 27,2019) తెల్లవారుజామున ఈ చోరీ జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన దొంగ రెండు గంటల పాటు అక్కడే ఉన్నాడు. ముందు గేటు నుంచి లోనికి వెళ్లడం అసాధ్యం. ఇంటి వెనుకవైపు నుంచి దొంగ వచ్చి ఉంటాడని పోలీసులు గుర్తించారు. 

ఉత్తమ్ రెడ్డి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. ఇంట్లో ఆరుగురు కుటుంబసభ్యులు ఉంటారు. మంగళవారం ఉదయం ఉత్తమ్‌రెడ్డి కుటుంబసభ్యులు బెడ్ రూమ్ లోకి వెళ్లారు. అక్కడ జరిగింది చూసి షాక్ తిన్నారు. బెడ్ రూమ్ లో ఉంచిన విలువైన వజ్రాల నగలు, బంగారం చోరీ అయినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీం రంగంలోకి దిగాయి. ఆధారాలు సేకరించారు. కాలనీ పరిసర ప్రాంతాల్లోనీ సీసీ టీవీ ఫుటేజ్‌ను సేకరించి విచారణ చేపట్టారు. హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న ఇంట్లో భారీ చోరీ జరగడం కలకలం రేపింది. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రత పెంచాలని కోరారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు దొంగ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇంట్లోకి ప్రవేశించిన దొంగ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్లాడు. 2 గంటల పాటు అక్కడే ఉన్నాడు. బెడ్ రూమ్ లో ఉంచిన వజ్రాలు, గోల్డ్ ఎత్తుకెళ్లాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. సెన్సార్ సెక్యూరిటీ  సిస్టమ్ ఆఫ్ చెయ్యడంతోనే దొంగ ఇంట్లోకి ప్రవేశించగలిగాడని పోలీసులు గుర్తించారు. ఉత్తమ్ రెడ్డి కుటుంబసభ్యులను, పని మనుషులు, సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Also Read : ఆగస్ట్ 31 లోపు పెండింగ్ చలానాలు కట్టకుంటే.. క్లారిటీ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు