DAV Public School : ఎల్‌కేజీ చిన్నారిపై అత్యాచారం కేసు.. పోలీస్ కస్టడీకి డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్, డ్రైవర్

ఎల్‌కేజీ చిన్నారిపై లైంగిక దాడి కేసులో బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి, ఆమె కారు డ్రైవర్ రజనీకుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.

DAV Public School : ఎల్‌కేజీ చిన్నారిపై అత్యాచారం కేసు.. పోలీస్ కస్టడీకి డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్, డ్రైవర్

DAV Public School : ఎల్ కేజీ చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితులు హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి, ఆమె కారు డ్రైవర్ రజనీకుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న వారిద్దరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారికి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇద్దరినీ బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.

డీఏవీ పబ్లిక్ స్కూల్ లో చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవర్ రజనీకుమార్ లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. డీఏవీ పాఠశాల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అనుమతి లేని తరగతులను నిర్వహిస్తోందని, సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపు లేదని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

ఐదవ తరగతి వరకు పాఠశాల విద్యాశాఖ అనుమతి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా 6, 7 తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ నుంచి ఎన్‌వోసీ పొందిన తర్వాత సిబిఎస్ఈ సిలబస్ కు మారాలనుకుంటే ఆ బోర్డు నుంచి గుర్తింపు తీసుకోవాలి. అయితే, అదేమి లేకుండానే సీబీఎస్ఈ సిలబస్ తో తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

చిన్నారిపై లైంగిక దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. అయితే, పాఠశాల గుర్తింపు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్కూల్ రీ ఓపెన్ చేయాలని, ప్రభుత్వమే ఆధీనంలోకి తీసుకుని స్కూల్ ని నడపాలని డిమాండ్ చేస్తున్నారు.