Bear Kills Couple: గుడికి వెళ్లిన దంపతుల్ని చంపి తిన్న ఎలుగుబంటి

మధ్యప్రదేశ్‌లో ఒక జంటపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. అంతేకాదు... వారి శరీరంలోని చాలా భాగాల్ని తినేసింది. ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

Bear Kills Couple: గుడికి వెళ్లిన దంపతుల్ని చంపి తిన్న ఎలుగుబంటి

Bear Kills Couple: మధ్య ప్రదేశ్‌లో దారుణం జరిగింది. అటవీ ప్రాంతంలో ఉన్న ఒక గుడికి వెళ్లిన దంపతుల్ని ఎలుగుబంటి చంపి తిన్నది. ఈ ఘటన గత ఆదివారం పన్నా జిల్లా, ఖేర్మై ప్రాంతంలో జరిగింది. ఈ ప్రదేశం జిల్లా కేంద్రానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం.

AP CM YS Jagan: అమరావతిపై ఎలాంటి కోపం లేదు: ఏపీ సీఎం జగన్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక అటవీ ప్రాంతంలోని గుడికి స్థానిక రాణిగంజ్ ప్రాంతానికి చెందిన ముఖేష్ ఠాకూర్, ఇందిరా ఠాకూర్ అనే దంపతులు వెళ్లారు. ఆదివారం ఉదయం గుడికి వెళ్తుండగా, ఇద్దరిపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. అనంతరం వారి మృతదేహాల్ని తీసుకుని మరో చోటుకు వెళ్లిన ఎలుగుబంటి నాలుగైదు గంటలపాటు తనతోనే ఉంచుకుంది. ఈ లోపు వారి శరీరంలోని చాలా భాగాల్ని ఎలుగుబంటి తినేసింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది ఎలుగు బంటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. చాలా సేపు శ్రమించి ఎలుగుబంటికి మత్తు మందు ఇచ్చారు.

Telangana Secretariat: తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు.. ప్రభుత్వ నిర్ణయం

అది స్పృహ తప్పి పడిపోయిన తర్వాత మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించినట్లు డివిజనల్ అటవీ శాఖాధికారి గౌరవ్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ఎలుగుబంటి తమ ఆధీనంలోనే ఉందని, దాన్ని అడవిలోకి వదిలేయబోమని చెప్పారు. స్థానికంగా ఉన్న జూకు తరలిస్తామన్నారు. కాగా, ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన అధికారులు మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.