Young Woman Suicide : షాపింగ్‌ మాల్‌లో చాక్లెట్‌ చోరీ చేసిన విద్యార్థిని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఆత్మహత్య

పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దూర్‌ జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. షాపింగ్ మాల్‌లో చాక్లెట్లు దొంగిలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపింగ్ మాల్ ఎదుల నిరసన తెలిపారు.

Young Woman Suicide : షాపింగ్‌ మాల్‌లో చాక్లెట్‌ చోరీ చేసిన విద్యార్థిని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఆత్మహత్య

Young Woman Suicide

Young Woman Suicide : పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దూర్‌ జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. షాపింగ్ మాల్‌లో చాక్లెట్లు దొంగిలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపింగ్ మాల్ ఎదుల నిరసన తెలిపారు. వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పోలీసులు సమాచారం అందించారు.

పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలు అలీపుర్‌దూర్‌ జిల్లా జైగావ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సుభాష్‌ పల్లిలో గ్రాడ్యుయేట్‌ మూడో సంవత్సరం చదువుతోంది. విద్యార్థిని సెప్టెంబరు 29న తన సోదరితో కలిసి ఆ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లింది. అక్కడి నుంచి వెళ్లిపోతుండగా చాక్లెట్లు దొంగిలిస్తూ పట్టుబడింది. షాప్ యాజమానికి క్షమాపణలు చెప్పి.. చాక్లెట్ కు డబ్బులు చెల్లించింది.
అయితే ఈ ఘటనలో షాపులో ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ వీడియో వైరల్‌గా మారడంతో అవమానానికి గురై యువతి.. ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకుంది.

Class 9 Girl: పరీక్షలో కాపీ కొడుతుందని అనుమానం.. బాలిక దుస్తులు విప్పించిన టీచర్.. అవమానంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

దీంతో స్థానికులు షాపింగ్ మాల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు జైగావ్ ఇన్‌ఛార్జ్ అధికారి ప్రబీర్ దత్తా పేర్కొన్నారు. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.