విమానాల్లో ప్రయాణం…..ప్రధాన నగరాల్లో షాపింగ్ మాల్ కస్టమర్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న మహిళ

విమానాల్లో ప్రయాణం…..ప్రధాన నగరాల్లో షాపింగ్ మాల్ కస్టమర్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న మహిళ

Bengaluru woman thief who flew to other cities to ‘steal’ handbags arrested : టిప్పు టాపుగా రెడీ అయ్ షాపింగ్ మాల్స్, స్పా సెంటర్లు, బ్యూటీ పార్లల లోకి ఎంటరై అక్కడ వినియోగదారుల దృష్టి మరల్చివారి హ్యండ్ బ్యాగ్ లు విలువైన ఆభరణాలు, సూట్ కేసులు దొంగిలించే మహిళను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగుళూరు కు చెందిన మూన్మూన్ హుస్సేన్ అనే మహిళ(46) దేశంలోని ప్రధాన మెట్రోనగరాల్లోని షాపింగ్ మాల్స్, స్పా సెంటర్లు, బ్యూటీ సెలూన్లే లక్ష్యంగా గత 10 ఏళ్లుగా దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. చోరీ చేయాలనుకున్నప్పుడు ఉదయం బెంగుళూరు నుంచి మెట్రో సిటీస్ కి ఫ్లైట్ లో వెళ్లి విలాసవంతమైన జీవితం గడిపే, ఉన్నత స్ధాయి వ్యక్తులు వచ్చే ప్రముఖ షాపింంగ్ మాల్స్, బట్టల, నగల దుకాణాలు, బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్లు ఎంచుకునేది.

తాను కూడా కొనుగోలు చేయటానికి వినియోగదారుడిలాగా షాపుల్లోకి వెళ్లి అక్కడ కొనుగోలు చేయటానికి వచ్చిన ఇతర కస్టమర్ల హ్యాండ్ బ్యాగ్ లు, సూట్ కేసులు, వ్యాలెట్ లు దొంగిలించి రాత్రికి తిరిగి బెంగుళూరు చేరుకునేది. ఆమెకు ఒక కుమార్తె ఉంది. భర్త నుంచి విడాకులు తీసుకున్న మూన్మూన్…. కుమార్తె తీసుకువచ్చే సంపాదన సరిపోక……తన విలాసాల కోసం దొంగతనాలు చేయటానికి అలవాటు పడింది. ప్రతి సారి బెంగుళూరు నుంచి వివిధ నగరాలకు ఫ్లైట్ లో వెళ్లి రావటంతో ఆమె ప్రవర్తన పట్ల ఎవరికీ అనుమానం రాలేదు.

2019వ సంవత్సరం, ఏప్రిల్ 6వ తేదీన ముంబై లోని లోయర్ పరేల్ లోని ఫోనిక్స్ షాపింగ్ మాల్ లో ప్రముఖ బట్టల దుకాణంలో షాపింగ్ చేయటానికి ఒక ధనికుల కుటుబం షాపుకు వచ్చింది. తమకు కావల్సిన వస్తువులన్నీ కొనుగోలు చేసిన తర్వాత బిల్లింగ్ కౌంటర్ వద్ద బిల్లు పే చేస్తూ…. ఆ కుటుంబంలోని మహిళ తన హ్యాండ్ బ్యాగ్ ను అక్కడ టేబుల్ పై ఉంచి క్యాషియర్ తో మాట్లాడుతోంది. ఇదే అదనుగా మూన్మూన్ హుస్సేన్ చాకచక్యంగా ఆమె బ్యాగ్ తీసుకుని పరారయ్యింది.

బిల్లింగ్ అయిపోయాక బ్యాగ్ కోసం చూసుకుంటే కనిపించలేదు. దీంతో ఆ కుటుంబం ఎన్ ఎం జోషి మార్గ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అందులో ఒక ఐ ఫోన్, బంగారు ఆభరణాలు, రూ.14.90 లక్షల నగదు పోగోట్టుకున్నట్లు మహిళ తన ఫిర్యాదు లో పేర్కోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. కానీ ఆమెకు సంబంధించిన వివరాలు ఎక్కడా లభ్యం కాలేదు. ఇదే తరహాలో గతంలో ముంబై లో జరిగిన జరా, లాక్మే షోరూమ్ తోపాటు …మరికొన్ని చోరీ కేసులను గుర్తించారు.

ఇలాంటి తరహా చోరీలకు పాల్పడుతున్న మహిళ ఒక్కరే అని తెలుసుకున్నారు. టెక్నాలజీ సహాయంతో మొత్తానికి ఆ మహిళ బెంగుళూరులో నివసిస్తున్నట్లు తెలుసుకున్నారు. పక్కా ఆధారాలతో బుధవారం బెంగుళూరులో ఆమెను అరెస్ట్ చేసి ముంబై తరలించారు. ఆమె తను చేసిన నేరాలను ఒప్పకుంది. మొదటగా ఆమె పదేళ్ల క్రితం కొల్ కతా లో నేర జీవితం ప్రారంభించింది. అప్పటినుంచి ఆమె నిర్విఘ్నంగా చోరీలు చేసుకుంటూ పోతోంది. ఆమెపై వివిధ నగారాల్లోనమోదైన కేసులు తెలుసుకునే ప్రయత్నంలో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఉన్నారు.