Cyber Fraud : హైదరాబాద్‌లో భారీ సైబర్ ఫ్రాడ్.. మహిళ నుంచి రూ.10లక్షలు కొట్టేశారు

హైదరాబాద్ లో మరో భారీ సైబర్ ఫ్రాడ్ జరిగింది. క్రిప్టో కరెన్సీ పై ఇన్వెస్ట్ మెంట్ పేరుతో పది లక్షలు మోసం చేశారు కేటుగాళ్లు.

Cyber Fraud : హైదరాబాద్‌లో భారీ సైబర్ ఫ్రాడ్.. మహిళ నుంచి రూ.10లక్షలు కొట్టేశారు

Cyber Fraud

Cyber Fraud : సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులే వారి టార్గెట్. మీ అత్యాశే వారి పెట్టుబడి. ముందు మాయ మాటలతో నమ్మిస్తారు. అధిక డబ్బు, అధిక లాభాల పేరుతో ఆశ పెడతారు. వారి మాయలో పడ్డామా? ఖతమ్.. అడ్డంగా బుక్కైపోయితారు. మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తారు. మీ దగ్గరున్న లక్షలు, కోట్ల రూపాయలు దోచేస్తారు. రెప్పపాటులో మీ డబ్బంతా మాయమైపోతుంది. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఆ తర్వాత మోసపోయామని తెలిసి ఎంతి చింతించినా ప్రయోజనం ఉండదు.

Kerala : ఎస్ఐపై కత్తితో దాడి.. చాకచక్యంగా తప్పించుకుని నిందితుడిని పట్టేశాడు

ఇక ఈ మధ్య సైబర్ క్రిమినల్స్ కన్ను క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ల మీద పడింది. వీటిని ఎరగా వేసి జనాలను చీట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ మెంట్ పేరుతో, అధిక లాభాలతో పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. వారి ఖాతాలోంచి డబ్బు లూటీ చేస్తున్నారు.

ATM Cash Theft : ఏటీఎంలలో డబ్బు డిపాజిట్ చేస్తూ చేతివాటం చూపిన వ్యక్తి అరెస్ట్

తాజాగా హైదరాబాద్ లో మరో భారీ సైబర్ ఫ్రాడ్ జరిగింది. క్రిప్టో కరెన్సీ పై ఇన్వెస్ట్ మెంట్ పేరుతో పది లక్షలు మోసం చేశారు కేటుగాళ్లు. సికింద్రాబాద్ కు చెందిన ఓ మహిళ నుంచి రూ.10లక్షలు కొట్టేశారు సైబర్ క్రిమినల్స్. బీటీసీ వెల్త్ వీఐపీ-24 పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ మహిళను అందులో యాడ్ చేశారు సైబర్ చీటర్స్.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మహిళతో చాట్ చేసి అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేశారు. ఒకే రోజు 12 విడతలుగా డబ్బులు కొట్టేసి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు కేటుగాళ్లు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మహిళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

కాగా.. సైబర్ నేరాల గురించి పోలీసులు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నా.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు. సైబర్ నేరాల గురించి పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. జనాలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయినా ఇంకా మోసపోతూనే ఉన్నారు. అందరూ ఇంటర్నెట్‌ వాడకంలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటే సైబర్‌ కేసులు ఎక్కువగా నమోదు కావని పోలీసులు చెబుతున్నారు. సైబర్‌ నిందితులను అదుపులోకి తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని పోలీసులు అంటున్నారు.