Bihar: పోలీస్ స్టేషన్‌లోనే ఉరి వేసుకుని వృద్ధుడి ఆత్మహత్య… ఒకరి సస్పెన్షన్

ఒక కేసు మీద అరెస్టైన 70 ఏళ్ల వృద్ధుడు పోలీస్ స్టేషన్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ఒకరిని సస్పెండ్ చేశారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.

Bihar: పోలీస్ స్టేషన్‌లోనే ఉరి వేసుకుని వృద్ధుడి ఆత్మహత్య… ఒకరి సస్పెన్షన్

Bihar: ఒక గొడవకు సంబంధించి అరెస్టైన వృద్ధుడు పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బిహార్‌లోని బక్సర్ ప్రాంతం, కోరాన్సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Elon Musk: ట్విట్టర్‌కు త్వరలో కొత్త సీఈవో.. పదవికి గుడ్ బై చెప్పనున్న ఎలన్ మస్క్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా కొప్వా గ్రామానికి చెందిన యమునా సింగ్ అనే 70 ఏళ్ల వృద్ధుడిని ఒక కేసుకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అతడు గురువారం ఉదయం పోలీస్ స్టేషన్‌లో ఉన్న కంప్యూటర్ రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే గుర్తించిన పోలీసులు అతడిని స్థానికి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలకు దిగారు. వృద్ధుడి మృతికి బాధ్యుడిని చేస్తూ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. కాగా, యమునా సింగ్ అనుమానాస్పద మృతిని నిరసిస్తూ అతడి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు.

స్థానిక రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కస్టడీలో పోలీసుల హింసకు తట్టుకోలేకే తన తండ్రి మరణించినట్లు యమునా సింగ్ కొడుకు ఆరోపించాడు. దీనిపై విచారణ జరుపుతున్నామని, సీసీ టీవీ కెమెరాలు పరిశీలిస్తున్నామని ఉన్నతాధికారులు చెప్పారు.