Illegal Affair : కోడలితో మామ అక్రమ సంబంధం…విషయం తెలిసిన కొడుకు..

కూతురులా చూసుకోవాల్సిన కోడలితో ఓ మామ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సభ్య సమాజంలో తలదించుకునే పని చేసి దారుణానికి ఒడిగట్టాడు.

Illegal Affair : కోడలితో మామ అక్రమ సంబంధం…విషయం తెలిసిన కొడుకు..

Illegal Affair

Illegal Affair : కూతురులా చూసుకోవాల్సిన కోడలితో ఓ మామ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సభ్య సమాజంలో తలదించుకునే పని చేసి దారుణానికి ఒడిగట్టాడు. తన సుఖానికి అడ్డొస్తున్న కొడుకును హతమార్చాడు. ఏమీ తెలియనట్లు పోలీసు స్టేషన్ కు వెళ్లి తనకొడుకు కనపడటంలేదని ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో చేసిన నేరం రుజువై కటకటాల పాలయ్యాడు తండ్రి.

బీహార్ రాజధాని పాట్నా పరిధిలోని కోద్రా ప్రాంతంలో నివసించే మిథిలేష్ రవిదాస్ కుమారుడు సచిన్ కు కొంతకాలం క్రితం వివాహం చేశాడు.  సచిన్ ఉపాధి నిమిత్తం గుజరాత్ లో ఉద్యోగం  చేస్తుండటంతో భార్యను  వదిలి ఉద్యోగానికి గుజరాత్ వెళ్ళాడు.  కోడలిపై  కన్నేసిన మామ రవిదాస్ మాయమాటలతో   కోడలిని వశపరుచుకున్నాడు.

కొడుకు ఇంట్లో లేకపోవటంతో  కోడలితో రాసలీలలు సాగిస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళకు ఈ విషయం కొడుకు సచిన్‌కు తెలిసిపోయింది. జులై7న ఇంటికి వచ్చిన సచిన్ తండ్రితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో రవిదాస్ కత్తి  తీసుకుని  సచిన్ గొంతుకోసి చంపేశాడు. శవాన్ని సమీపంలోని తోటలో పడేశాడు.

ఏమీ ఎరుగనట్లు పోలీసు స్టేషన్ కు వెళ్లి తన కొడుకు కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశాడు.   పైగా తనకు   ఐదుగురు వ్యక్తులపై అనుమానం ఉందని పోలీసులకు తెలిపాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తోటలో పడి ఉన్న సచిన్ శవాన్ని గుర్తించి పోస్టు మార్టంకి తరలించారు.

పోస్టుమార్టం రిపోర్టులో గొంతుకోసి చంపబడినట్లు తేలింది. పోలీసులు  అనుమానితులతో పాటు రవిదాస్‌ను   అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతను పొంతనలేని సమాధానాలు  ఇవ్వటంతో పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించారు. దీంతో చేసిన నేరం ఒప్పుకున్నాడు. కోడలితో ఉన్న అక్రమ సంబంధానికి కొడుకు అడ్డు వస్తున్నాడనే కారణంతోనే  హతమార్చినట్లు ఒప్పుకున్నాడు.  పోలీసులు రవిదాస్‌ను రిమాండ్‌కు తరలించారు.