Meesho: డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే కిలో బంగాళదుంపలు డెలివరీ అయ్యాయి

ప్రాడక్టర్ ఆర్డర్ చేసేటప్పుడే పూర్తి పేమెంట్ చేశానని చేతన్ కుమార్ తెలిపాడు. కాగా, ఈ డెలివరీని తెరుస్తుండగా వీడియో తీశారు. ఆన్‭లైన్ మోసాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయమై తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు రాలేదని పర్వాల్‭పూర్ పోలీసులు పేర్కొన్నారు.

Meesho: డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే కిలో బంగాళదుంపలు డెలివరీ అయ్యాయి

Bihar Man Orders Drone Camera From Online Shopping Site, Receives Potatoes Instead

Meesho: ఆన్‭లైన్ కొనుగోళ్ల గోల్‭మాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొబైల్ ఫోన్లు ఆర్డర్ చేస్తే అప్పుడప్పుడు సబ్బు బిళ్లలు, ఇటుక పెల్లలు వస్తుంటాయి. చిన్నా చితకా ఆన్‭లైన్ సంస్థలే కాకుండా పెద్ద సంస్థల్లో కూడా ఇలా జరుగుతుంటాయి. ఇక తాజాగా, బిహార్‭లో ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. ఒక వ్యక్తి డ్రోన్ కెమెరా ఆర్డర్ చేయగా.. అతడికి కిలో బంగాళదుంపలు డెలివరీ అయ్యాయి. ‘మీషో’ అనే ఆన్‭లైన్ సంస్థ ఘనకార్యం ఇది.

బిహార్‭లోని నలందకు సమీపంలో ఉన్న పర్వాల్‭పూర్ అనే గ్రామానికి చెందిన చేతన్ కుమార్ అనే వ్యక్తి మీషో అనే సంస్థలో డ్రోన్ కెమెరా ఆర్డర్ చేశాడు. తీరా ఆ ఆర్డర్ డెలివరీ అయింది. ప్యాకేజీ చూస్తే కాస్త అనుమానంగా అనిపించి డెలివరీ బాయ్ చేతనే ఓపెన్ చేయించారు. వారి అనుమానాన్ని నిజం చేస్తూ డ్రోన్ కెమెరాకు బదులు కిలో బంగళాదుంపలు బయట పడ్డాయి. ఫ్రాడ్ గురించి డెలివరీ బాయ్ ఒప్పుకున్నాడు. అయితే ఈ ఫ్రాడ్‭తో డెలివరీ కంపెనీకి సంబంధం ఉందా లేదా అనే విషయం తనకు తెలియదని పేర్కొన్నాడు.