యూపీ: 23 మంది చిన్నారులను బందీచేసిన ఉన్మాది భార్యను రాళ్లతో కొట్టి చంపిన స్థానికులు

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 08:10 AM IST
యూపీ: 23 మంది చిన్నారులను బందీచేసిన ఉన్మాది భార్యను రాళ్లతో కొట్టి చంపిన స్థానికులు

యూపీలోని ఫరూకాబాద్‌లో తన కూతురు పుట్టిన రోజంటూ ఇంటికి పిలిచి 23 మంది చిన్నారులను బంధించిన  ఉన్మాది సుభాష్‌ బాథమ్‌ భార్యను స్థానికులు రాళ్లతో కొట్టీ కొట్టీ చంపేశారు. పుట్టిన రోజని మాయమాటలు చెప్పి స్థానికుల పిల్లలను తన ఇంటికి పిలిచి బంధించిన సుభాష్ బాథమ్ ను పోలీసులు పిల్లల్ని విడిపించే క్రమంలో గంటల తరబడి పోలీసులు పిల్లల్ని విడిపించటానికి పలు యత్నాలు చేశారు. కానీ కుదరలేదు. దీంతో ఎట్టకేలకు సుభాష్  కాల్చి చంపి పిల్లల్ని కాపాడిన విషయం తెలిసిందే. 

సుభాష్ బాథమ్ మృతి తరువాత అతని భార్యపై స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు.ఈ క్రమంలో సుభాష్ భార్య తనకు ఎప్పటికైనా స్థానికులతో ప్రమాదం ఉంటుందనే ఉద్ధేశంతో పారిపోవటానికి యత్నించటంతో స్థానికులు ఆమెను రాళ్లతో దారుణంగా కొట్టారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం (జనవరి 31,2020)న మృతి చెందింది. 
కాగా ఆమెను హాస్పిటల్ కు తరలించే సమయానికే పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం ఆమె మృతికి గల కారణాలు చెప్పగలమని తెలియజేస్తామని కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. 

కాగా..హత్య కేసులో జైలుకు వెళ్లిన సుభాష్ బాథమ్ జనవరి 30న ఫరూకాబాద్‌లో జైలు నుంచి బెయిల్ పై బయటికి వచ్చాడు. తరువాత నేను మారిపోయాను..అంటూ నమ్మించి తమ కుమార్తె బర్త్‌డే వేడుకలకు రమ్మని స్థానికుల పిల్లలను తన ఇంటికి పిలిచాడు. ఇది నమ్మిన స్థానికులు తమ పిల్లల్ని పంపించారు.  అలా వచ్చిన మొత్తం 23 మంది చిన్నారులను బందీంచాడు. దీంతో ఎంతకూ తమ పిల్లలు రాకపోవటంతో ఆందోళన చెందిన తల్లులు సుభాష్ ఇంటికి వెళ్లి మా పిల్లలు ఏరి అని అడిగారు. దీంతో సుభాష్ తన నిజస్వరూపం బైటపెట్టాడు. పిల్లల్ని ఇచ్చేది లేదు పొండి లేకుండా పిల్లల్ని మిమ్మల్ని కాల్చి పడేస్తానంటూ బెదరించారు. దీంతో భయపడినవారంతా పోలీసులకు సమాచారం అందించారు. తమ పిల్లల్ని కాపాడమని కోరారు. 

దీంతో హుటాహుటి ఘటనాస్థాలానికి చేరుకున్న పోలీసులు దాదాపు తొమ్మిది గంటల ఆపరేషన్ అనంతరం ఎట్టకేలకు పోలీసులు నిందితుడు సుభాష్ బాతంను ఎన్‌కౌంటర్ చేసి పిల్లలను విడిపించారు. ఈక్రమంలో పారిపోతున్న సుభాష్ భార్యను స్థానికులు రాళ్లతో కొట్టగా..హాస్పిటల్ లో చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది.