Hyderabad : పెళ్లి పేరుతో మహిళను 10లక్షలకు మోసం చేసిన నల్ల జాతీయుడు

విదేశాల్లో ఉంటానని.. పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్ కు చెందిన మహిళను నమ్మించి ఆమె వద్ద నుంచి రూ.10 లక్షలు కాజేసిన సైబర్ చీటర్ ఉదంతం వెలుగు చూసింది.

Hyderabad : పెళ్లి పేరుతో మహిళను 10లక్షలకు మోసం చేసిన నల్ల జాతీయుడు

Cyber Cheater Arrested

Hyderabad :  విదేశాల్లో ఉంటానని.. పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్ కు చెందిన మహిళను నమ్మించి ఆమె వద్ద నుంచి రూ.10 లక్షలు కాజేసిన సైబర్ చీటర్ ఉదంతం వెలుగు చూసింది.  హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లికి చెందిన కవిత అనే మహిళ వివాహం  కోసం   మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో తన ప్రోఫైల్ క్రియేట్ చేసుకుంది.

ఆమె ప్రోఫైల్ చూసిన కృష్ణ కుమార్ అనే వ్యక్తి ఆమెతో సంప్రదింపులు జరిపాడు. తాను యూకే, స్కాట్లాండ్ లో ఉంటానని తెలిపాడు. ఇండియాకు వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె అతని మాటలు నమ్మింది.  ఈక్రమంలో  కొన్నాళ్లకు తాను ఇండియా వచ్చానని ఎయిర్ పోర్టులో అధికారులు తన డబ్బులు,లగేజ్ సీజ్ చేశారని ఆమెకు ఫోన్ చేశాడు.

వాటిని విడిపించటానికి డబ్బులు కావాలని చెప్పి ఆమె వద్దనుంచి రూ.10 లక్షలు తీసుకున్నాడు. ఆతర్వాత అతని ఫోన్ స్విఛ్చాఫ్ రావటంతో   మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు  ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి ఢిల్లీలో నివాసం ఉంటున్న నల్ల జాతీయుడు కార్బల్ ఎడిమాండోను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.