అసలేం జరిగింది : సూర్యాపేట అయ్యప్ప ఆలయం దగ్గర పేలుడు, ఒకరు మృతి

సూర్యాపేట పట్టణంలో పేలుడు కలకలం రేపింది. ఓ పాత ఐరన్ స్క్రాప్ దుకాణంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 06:16 AM IST
అసలేం జరిగింది : సూర్యాపేట అయ్యప్ప ఆలయం దగ్గర పేలుడు, ఒకరు మృతి

సూర్యాపేట పట్టణంలో పేలుడు కలకలం రేపింది. ఓ పాత ఐరన్ స్క్రాప్ దుకాణంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

సూర్యాపేట పట్టణంలో పేలుడు కలకలం రేపింది. ఓ పాత ఐరన్ స్క్రాప్ దుకాణంలో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం(సెప్టెంబర్ 13,2109) ఉదయం అయ్యప్ప ఆలయం సమీపంలోని పాత ఇనుము సామాను దుకాణంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు జరగడం, ఒకరు చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల్లో భయాందోళన నింపింది. అసలేం జరిగిందో తెలియాల్సి ఉంది. బాంబు పేలిందేమోనని స్థానికులు భయపడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. పేలుడికి కారణాలు అన్వేషిస్తున్నారు. బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మృతుడిని మధ్యప్రదేశ్ కి చెందిన రామచంద్రగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో ఒకరిని యూపీకి చెందిన సల్మాన్ గా, మరొకరిని రామ్ కోటి తండాకు చెందిన బుచ్చమ్మగా గుర్తించారు. సల్మాన్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ పేలుడుతో సూర్యాపేట పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రామచంద్ర, సల్మాన్ ఇద్దరూ కలిసి ఇనుప సామాన్ల దుకాణం నిర్వహిస్తున్నారు. పాత ఇనుప సామాను సేకరించి వాటిని ముక్కలు చేస్తారు. ఆ తర్వాత వాటిని హైదరాబాద్ కి ఎక్స్ పోర్టు చేస్తుంటారు. ప్రత్యేక మెషిన్ ద్వారా ఐరన్ వస్తువులను వారు ముక్కలు చేస్తారు.

శుక్రవారం ఉదయం ఓ డ్రమ్ ని కట్ చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా బ్లాస్ జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. బుచ్చమ్మకి స్వల్పగాయాలు అయ్యాయి. డ్రమ్ము వల్ల పేలుడు సంభవించిందా లేక మెషిన్ వల్లనా అనే దానిపై స్పష్టత లేదు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తోంది. ఆ డ్రమ్ములో రసాయనాలు ఉన్నాయా లేక పేలుడు పదార్దాలు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది.