Delhi : అంధురాలిపై అత్యాచారం చేసిన కామాంధుడు

కామంతో కళ్లు మూసుకుపోయిన వారికి అవతలి వారి అంగవైకల్యంతో పనిలేదు. అంధురాలైన యువతి రోడ్డు దాటించమని అడిగితే ...సహాయం చేసే నెపంతో ఆమెను   నిర్జనంగా ఉన్న రోడ్డులోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసాడో కామాంధుడు.

Delhi : అంధురాలిపై అత్యాచారం చేసిన కామాంధుడు

Blind Woman Rape

Delhi :  కామంతో కళ్లు మూసుకుపోయిన వారికి అవతలి వారి అంగవైకల్యంతో పనిలేదు. అంధురాలైన యువతి రోడ్డు దాటించమని అడిగితే …సహాయం చేసే నెపంతో ఆమెను   నిర్జనంగా ఉన్న రోడ్డులోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసాడో కామాంధుడు.

ఢిల్లీలోని వికాస‌పురి బస్టాండ్ ప్రాంతంలో నివసించే యువతి (20) అంధురాలు.  ఆమె పొరపాటున సీతాపురి బస్టాప్ లో బస్సు దిగింది.  తాను వెళ్లాల్సింది అది కాదని తెలుసుకుని రోడ్డు మీద నిలబడి రోడ్డు దాటించమని స్ధానికులను సహయం కోరింది.  ఆ సమయంలో అటు వచ్చిన నిందితుడు (24) ఆమెను రోడ్డు దాటించే పనిలో ఎవరూ తిరగని ఖాళీగా ఉన్న సందులోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసిపరారయ్యాడు.

ఆ సందులోంచి ఎలాగోలా బయటపడిన బాధితురాలు ఆటో ఎక్కి ఇంటికి చేరింది.  జరిగిన సంఘటన తల్లి తండ్రులకు చెప్పగానే వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. ఆస్పత్రి నుంచి సమాచారం తెలుసుకున్న దబ్రీ  పోలీసులు బాధితురాలి  వద్ద నుంచి వివరాలు సేకరించారు.

సీసీటీవీ ఫుటేజి ద్వారా నిందితుడిని అదే ప్రాంతానికి చెందిన చేతన్ ఖన్నాగా గుర్తించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసునమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ కమీషన్ ఫర్ ఉమెన్ చీఫ్ స్వాతి మలివాస్ బాధితురాలిని పరామర్శించి తగిన సహయం అందచేస్తామని హామీ ఇచ్చారు.

Also Read : Delhi Metro : మెట్రో స్టేషన్‌లో యువతిపై లైంగిక వేధింపులు-పట్టించుకోని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు