Aedula Company : ఇంట్లో ఉంటూనే లక్షల్లో ఆదాయం అంటూ ఘరానా మోసం.. వత్తుల తయారీ పేరుతో రూ.20కోట్లు టోకరా

నిరుద్యోగులు, గృహిణులే వారి టార్గెట్. ఇంట్లో ఉంటూనే నెలకు లక్షలు సంపాదించొచ్చని నమ్మించారు. ఉపాధి, ఆదాయం పేరుతో లక్షలు వసూలు చేశారు. కట్ చేస్తే.. కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించారు.

Aedula Company : ఇంట్లో ఉంటూనే లక్షల్లో ఆదాయం అంటూ ఘరానా మోసం.. వత్తుల తయారీ పేరుతో రూ.20కోట్లు టోకరా

Aedula Company

Aedula Company : నిరుద్యోగులు, గృహిణులే వారి టార్గెట్. ఇంట్లో ఉంటూనే నెలకు లక్షలు సంపాదించొచ్చని నమ్మించారు. ఉపాధి, ఆదాయం పేరుతో లక్షలు వసూలు చేశారు. కట్ చేస్తే.. కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఉడాయించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

తమ వద్ద మిషన్ కొనుగోలు చేస్తే నెలకు 40వేల నుంచి 50వేల వరకు ఆదాయం వస్తుందని ఆశ చూపారు. అలా తెలుగు రాష్ట్రాల్లో 700 నుంచి 800 మంది వద్ద సుమారు రూ.20 కోట్లు వసూలు చేశారు. ఆ తర్వాత ముఖం చాటేశారు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు.

Diginal India Scam : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘరానా మోసం.. రూ.30కోట్లతో జంప్

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ ఎదులా కంపెనీ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. నెలకు లక్షల్లో సంపాదించవచ్చని ఆశ చూపి బాధితులతో లక్ష 77వేల రూపాయలకు మిషన్ కొనుగోలు చేయించారు. ఆ తర్వాత వారు తయారు చేసే వత్తులను కొనుగోలు చేస్తామని నమ్మబలికారు. కానీ, నెలలు గడుస్తున్నా వత్తులు కొనుగోలు చేయడం లేదంటూ బాధితులు బోడుప్పల్ లోని ఎదులా కంపెనీ ముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Call Girl Scam : మీ ఫోన్లకు ఇలా మెసేజ్‌లు వస్తున్నాయా? కాల్ గ్లర్స్ కావొచ్చు.. జాగ్రత్త..!

”మిషన్ కొనుగోలు కోసం తొలుత 20వేలు కట్టాలన్నారు. అడ్వాన్స్ కింద 20వేలు ఇచ్చాం. ఆ తర్వాత లక్ష రూపాయలు పే చేశాం. డబ్బు ఎలా సంపాదించవచ్చు అనేది యూట్యూబ్ లో వివరించారు. నెలకు రూ. 30వేలు ఆదాయం వస్తుందన్నారు. వాళ్ల మాటలు నమ్మి ఉదయం 5 గంటలకే లేచి పని స్టార్ట్ చేసేవాళ్లం. అర్థరాత్రి 12 గంటలకు వరకు పని చేశాం. ఎక్కువ డబ్బు రావాలని విపరీతంగా కష్టపడ్డాం. ఒకేసారి డిపాజిట్ కట్టాలని చెప్పారు.(Aedula Company)

అప్పుడప్పుడు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదన్నారు. కాటన్ కూడా వాళ్లే ఇస్తామన్నారు. కొంతమంది 100 కేజీల కాటన్ కూడా తీసుకున్నారు. కర్నాటక నుంచి వచ్చిన కొంతమంది డబ్బు కట్టి 500 కేజీల కాటన్ తీసుకున్నారు. మిషన్ కేవలం రూ.20వేలే. అయితే లక్షా 77వేలు కట్టించుకున్నారు. కేజీకి 300 రూపాయల చొప్పున.. 100 కేజీల కాటన్ కు రూ.30వేలు డిపాజిట్ చేయించుకున్నారు. మొత్తంగా రూ.2లక్షల 7వేలు ఇన్వెస్ట్ చేయించుకున్నారు. మార్చిలో మిషన్లు కొన్న వారికి ఇంతవరకు డబ్బు చెల్లించలేదు. వత్తులు తయారు చేసి పంపినా.. అకౌంట్ లో ఒక్కపైసా కూడా వేయలేదు. ఇలా వందలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఇక్కడి నుంచి పారిపోయారు” అని బాధితులు వాపోయారు.

”వత్తుల తయారీ పేరుతో బోడుప్పల్ కి చెందిన ఏజీజీ సంస్థ యజమాని బాలస్వామి గౌడ్ రూ.20 కోట్ల మేర మోసం చేశాడు. దూది, వత్తుల తయారీ యంత్రం మేమే ఇస్తాం. వత్తులు తయారు చేసి ఇస్తే కిలోకు రూ.600 ఇస్తాం అని ప్రచారం చేసుకున్నాడు. 600 మంది నుంచి రూ.1.70 లక్షల చొప్పున రూ.20కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు” అని బాధితులు చెప్పారు.

ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించొచ్చు అనే పేరుతో ఇటీవలి కాలంలో మోసాలు పెరిగిపోయాయి. నిరుద్యోగులు, గృహిణులే టార్గెట్ గా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయ మాటలతో అడ్డంగా మోసం చేస్తున్నారు. ముందు కాస్త కూస్తో నిజంగానే డబ్బు ఇస్తారు. ఆ తర్వాత డిపాజిట్ పేరుతో సెక్యూరిటీ పేరుతో మిషన్ల కొనుగోలు పేర్లతో వందలాది మంది నుంచి డబ్బు వసూలు చేస్తారు.

కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. కట్ చేస్తే.. ఆ డబ్బుతో ఉడాయిస్తారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగిపోయాయి. ఇలాంటి మోసాల గురించి తరుచుగా వార్తలు వస్తున్నా, పోలీసులు చైతన్య పరుస్తున్నా.. ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. కేటుగాళ్ల మాయ మాటలు నమ్మి అడ్డంగా దగా పడుతున్నారు. ఇలాంటి ప్రకటనలు, మాయ మాటల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.