Delhi Murder Case: అఫ్తార్ తీవ్రంగా కొట్టాడని చెప్పిన శ్రద్ధ.. వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా వెల్లడి

‘‘అతడు ఇవాళ వెళ్లిపోతున్నాడు. నేను ఇవాళ మన వర్క్  చేయలేకపోతున్నాను... నిన్న తగిలిన దెబ్బలకు వంటి నొప్పితో బాధపడుతున్నాను.. బీపీ తగ్గిపోయింది’’ అని తన మేనేజర్ కు 2020 నవంబరులో శ్రద్ధ మెసేజ్ చేసింది. అలాగే, మంచంపై నుంచి లేసే శక్తి కూడా తనకు లేదని చెప్పింది. తీవ్ర వెన్నునొప్పితో, కాళ్లలో తిమ్మిర్లతో బాధపడుతున్నట్లు కూడా అప్పట్లో శ్రద్ధ పేర్కొంది.

Delhi Murder Case: అఫ్తార్ తీవ్రంగా కొట్టాడని చెప్పిన శ్రద్ధ.. వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా వెల్లడి

Delhi Murder Case: ఢిల్లీలో శ్రద్ధావాకర్‌ అనే యువతిని ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్‌ పూనావాలా దారుణంగా హత్య చేసి, ముక్కలుగా కోసిన కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన శ్రద్ధావాకర్‌, అఫ్తాబ్ 2019 నుంచి కలిసి ఉంటున్నారు. శ్రద్ధ 2020లో వాట్సాప్ లో తన మేనేజర్ కరణ్ తో చేసిన చాటింగ్ ద్వారా కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. శ్రద్ధావాకర్ పై అఫ్తాబ్ గతంలోనూ పలుసార్లు దాడి చేసినట్లు వాటి ద్వారా తెలుస్తోంది.

‘‘అతడు ఇవాళ వెళ్లిపోతున్నాడు. నేను ఇవాళ మన వర్క్  చేయలేకపోతున్నాను… నిన్న తగిలిన దెబ్బలకు వంటి నొప్పితో బాధపడుతున్నాను.. బీపీ తగ్గిపోయింది’’ అని తన మేనేజర్ కు 2020 నవంబరులో శ్రద్ధ మెసేజ్ చేసింది. అలాగే, మంచంపై నుంచి లేసే శక్తి కూడా తనకు లేదని చెప్పింది. తీవ్ర వెన్నునొప్పితో, కాళ్లలో తిమ్మిర్లతో బాధపడుతున్నట్లు కూడా అప్పట్లో శ్రద్ధ పేర్కొంది.

తాను ఉంటోన్న ప్రదేశం నుంచి మరోచోటుకి వెళ్తున్నాని కూడా అప్పట్లో తన మేనేజర్ కు శ్రద్ధ తెలిపింది. అలాగే, తాను పోలీస్ స్టేషన్ కు వెళ్తానని, మహిళా మండలి వారిని సంప్రదిస్తానని కూడా పేర్కొంది. తన ముఖంపై గాయం ఉన్న ఫొటోను కూడా ఆమె తన మేనేజర్ కు షేర్ చేసింది. తాను చేస్తున్న జాబ్ కు సెలవు తీసుకోవడానికి అది ఉపయోగపడుతుందని చెప్పింది. మరోవైపు, తన స్నేహితులతో వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ తన ఫొటోను శ్రద్ధ పోస్ట్ చేసింది.

అయితే, తనకైన గాయాల గురించి ఏదో దాచి పెడుతున్నట్లు తెలుస్తోంది. తాను మెట్లు ఎక్కుతున్న సమయంలో జారిపడ్డానని, దీంతో తన ముక్కుకు గాయమైందని ఆమె పేర్కొంది. శ్రద్ధ, అఫ్తార్ మధ్య చాలాసార్లు గొడవ జరిగిందని శ్రద్ధ స్నేహితుడు లక్ష్మణ్ నాడార్ కూడా మీడియాకు తెలిపాడు. తనను ఇంటి నుంచి రక్షించి తీసుకెళ్లాలని, లేదంటే రాత్రి సమయంలో అఫ్తార్ తనను చంపేస్తాడని ఆమె ఓ సారి తనతో చెప్పిందని లక్ష్మణ్ అన్నాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..