కేరళ హైకోర్టుని ఆశ్రయించిన సన్నీ లియోన్

కేరళ  హైకోర్టుని ఆశ్రయించిన సన్నీ లియోన్

Bollywood actor Sunny Leone moves Kerala High Court seeking anticipatory bail :బాలీవుడ్ నటి, శృంగార తార సన్నీ లియోన్ ముందస్తు బెయిల్ కోసం కేరళ హై కోర్టును ఆశ్రయించారు. ఒక ఈవెంట్ మేనేజర్ ను మోసం చేసిన కేసులో సన్నీలియోన్ ను కొచ్చి క్రైం బ్రాంచ్ పోలీసులు శనివారం నాడు  ప్రశ్నించారు.

కేరళలోని పెరంబపూర్ కు చెందిన ఆర్.షియాన్ అనే వ్యక్తి సన్నీలియోన్  తనను మోసం  చేసిందని ఫిర్యాదు చేశాడు.  రెండు కార్యక్రమాల్లో పాల్గోంటానని చెప్పి తనవద్ద రూ.29లక్షలు తీసుకుని ముఖం చాటేసిందని అతను ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక  టీవీ షో కోసం తిరువనంతపురం  సమీపంలోని  పూవర్ రిసార్ట్ కు వచ్చిన సన్నీ లియోన్ ను పోలీసులు శనివారం ప్రశ్నించి ఆమె వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.

ఆమెపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం కేరళ హై కోర్టును ఆశ్రయించారు. ఈవెంట్ ఆర్జనైజర్ చేసిన ఆరోపణలను సన్నీ లియోన్ ఖండించారు. ప్రోగ్రాం షెడ్యూల్ సరిగా ఏర్పాటు చేయకుండా తనను రెండు సార్లు అనవసరంగా రప్పించారని, ఆరెండు సార్లు కార్యక్రమాలు జరగలేదని తెలిపారు.

తనకు రావల్సిన డబ్బు కూడా సకాలంలో చెల్లించలేదని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం రేయింబవళ్లు షూటింగ్ చేస్తూ, ఇండ్రస్ట్రీకి పాతరోజులు తీసుకు  రావాలని చూస్తుంటే ఇలాంటి వారి మాటలు బాధ కలిగిస్తున్నాయని ఆమె అన్నారు. పోలీసులకు నేను వివరణ ఇచ్చాను.  చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆమె వ్యాఖ్యానించారు.  స్ల్పిట్స్ విల్లా కొత్త సీజన్ షూటింగ్ లో భాగంగా ఆమె ప్రస్తుతం తిరువనంతపురంలో ఉన్నారు.