Bomb Explodes At School: స్కూల్లో క్లాసులు జరుగుతుండగా పేలిన నాటు బాంబు.. తప్పిన ప్రమాదం

పశ్చిమ బెంగాల్‌లోని ఒక స్కూల్లో శనివారం మధ్యాహ్నం పేలుడు జరిగింది. స్కూలు బిల్డింగు పై భాగంలో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Bomb Explodes At School: స్కూల్లో క్లాసులు జరుగుతుండగా పేలిన నాటు బాంబు.. తప్పిన ప్రమాదం

Bomb Explodes At School: పశ్చిమ బెంగాల్‌లోని ఒక స్కూల్లో నాటు బాంబు పేలింది. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం. శనివారం మధ్యాహ్నం, ఉత్తర 24 పరగణాలకు చెందిన తీతాఘర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

CM KCR: వారం రోజుల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు: సీఎం కేసీఆర్

స్థానిక ఫ్రీ ఇండియా అనే ప్రభుత్వ పాఠశాలలో క్లాసులు నిర్వహిస్తున్న సమయంలో స్కూలు బిల్డింగ్ పైకప్పు వద్ద పేలుడు జరిగింది. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్కూల్లోని టీచర్లు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ, ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే స్కూలు యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Pregnant Woman: గర్భిణిని ట్రాక్టర్‌తో తొక్కి చంపిన రికవరీ ఏజెంట్.. ట్రాక్టర్ లోన్ కట్టలేదని ఘాతుకం

క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఈ బాంబు ఇక్కడికి ఎలా వచ్చింది అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దగ్గర్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. స్థానికుల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. స్కూలు బయటి నుంచి కొందరు వ్యక్తులు బాంబును స్కూల్లోకి విసిరేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.