శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్

  • Published By: chvmurthy ,Published On : September 3, 2019 / 03:42 PM IST
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు  బ్లాస్టే చేస్తానని ఒక ఆగంతకుడు బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.సెప్టెంబరు 4 బుధవారం  ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బ్లాస్ట్‌ చేయబోన్నానంటూ ఓ ఆగంతకుడు విమానాశ్రయంకి ఒక ఈ మెయిల్‌ పంపాడు. సాయిరాం కాలేరు అనే మెయిల్‌ ఐడీ  నుండి విమానాశ్రయానికి మెయిల్‌ వచ్చింది.

సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ఎటువంటి అనుమానాస్పద వస్తువు  ఎయిర్ పోర్టులో లభ్యంకాలేదని తెలుస్తోంది. 

ఎయిర్ పోర్టులో ఒకవైపు తనిఖీలు చేస్తూనే మరో వైపు మెయిల్  పంపిన  ఆగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది. ఆగంతకుడు ఎక్కడ ఉంటాడనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు అన్వేషణ చేస్తున్నారు.