లైంగిక వేధింపుల కేసులో బాక్సింగ్ కోచ్ అరెస్ట్

  • Published By: chvmurthy ,Published On : March 18, 2020 / 02:11 AM IST
లైంగిక వేధింపుల కేసులో బాక్సింగ్ కోచ్ అరెస్ట్

కోచింగ్ ఇచ్చి ప్రపంచ స్ధాయి బాక్సర్లుగా తీర్చి దిద్దాల్సిన  గురువులు స్టూడెంట్స్ పై లైంగిక వేధింపులు పాల్పడుతుంటే కొత్త ఆటగాళ్లు ఎక్కడినుంచి తయారవుతారు ? టోర్నమెంట్ కు వెళ్లిన సమయంలో కోచ్ తనను లైంగికంగావేధించాడని మహిళా బాక్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ కోచ్ ను అరెస్టు  చేశారు. 

కొల్ కతా లో జరిగిన  బాక్సింగ్ టోర్నమెంట్ లో పాల్గోనేందుకు ఫిబ్రవరి 27న ఢిల్లీ నుంచి కొల్ కతా వెళుతుండగా తమతో పాటు ప్రయాణించిన కోచ్(28) తనపై లైంగిక దాడి చేసినట్లు 19 ఏళ్ల మహిళా బాక్సర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొల్ కతాలో ఉన్న సమయంలోకూడా కోచ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో వివరించింది.

మహిళా బాక్సర్ హర్యానా తరుఫున టోర్నమెంట్ లో పాల్గోంది.  ఫిర్యాదు నమోదు చేసుకున్నపోలీసుల కోచ్ ను  హర్యానాలోని సోనిపట్ లో అరెస్టు చేశారు.  విచారణలో  బాక్సర్ న వేధించినట్లు కోచ్ అంగీకరించాడని పోలీసుల తెలిపారు.

నిందితుడు  సోనిపట్ లో బాక్సింగ్ అకాడమీ నడుపుతున్నాడు. బాక్సింగ్ టోర్నమెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. నిందితుడికి జాతీయ స్ధాయి బాక్సర్లైన ఇద్దరు పిల్లలు వున్నారు.  నిందితుడిపై సెక్షన్ 354 ఎ (లైంగిక వేధింపులు మరియు లైంగిక వేధింపులకు శిక్ష) మరియు ఐపిసి యొక్క 376 (అత్యాచారానికి శిక్ష) కింద  పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read | డేంజర్ బెల్స్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా మరణాల సంఖ్య