అసలేం జరిగింది : 3 రోజుల తర్వాత పురాతన భవనంలో బాలుడి మృతదేహం లభ్యం

ఖమ్మం పట్టణంలో 13 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. 3 రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ఓ పురాతన భవనంలో

  • Published By: veegamteam ,Published On : August 25, 2019 / 07:38 AM IST
అసలేం జరిగింది : 3 రోజుల తర్వాత పురాతన భవనంలో బాలుడి మృతదేహం లభ్యం

ఖమ్మం పట్టణంలో 13 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. 3 రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ఓ పురాతన భవనంలో

ఖమ్మం పట్టణంలో 13 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. 3 రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ఓ పురాతన భవనంలో బాలుడి డెడ్ బాడీ లభ్యమైంది. మున్నేరులోని స్లమ్ ఏరియాలో నివాసం ఉంటున్న సాగర్‌ అనే బాలుడు 3 రోజుల నుంచి కనిపించకుండాపోయాడు. సాగర్ నయాబజార్ లోని స్కూల్ లో 6వ తరగతి చదువుతున్నారు. పిల్లలతో కలిసి మున్నేరులో ఈతకు వెళ్లాడు. ఆ తర్వాత అదృశ్యం అయ్యాడు. మున్నేరులో పడిపోయాడనే అనుమానంతో గజ ఈతగాళ్ల సాయంతో బంధువులు, పోలీసులు ముమ్మరంగా గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. 

ఇంతలో సాగర్ అమ్మమ్మ ఇంటికి సమీపంలోని పురాతన భవనంలో ఆదివారం(ఆగస్టు 25,2019) ఉదయం ఓ మృతదేహం కనిపించింది. ఉరి వేసుకుని చనిపోయినట్టుగా ఉంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది.  అది సాగర్‌ మృతదేహమేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. సాగర్ ను విగతజీవిగా చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాగర్‌ ని ఎవరో చంపి పాడుబడిన భవనంలో దాచి ఉంచారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాఫ్తు చేపట్టారు. కాగా, సాగర్ ది హత్య అయితే ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది మిస్టరీగా మారింది.

Also Read : మనుషులేనా : విరిగిన కాళ్లనే తలగడగా పెట్టారు