ప్రైవేట్ స్కూల్ లో దారుణం : సాంబారు పాత్రలో పడి LKG విద్యార్థి మృతి

కర్నూలు జిల్లా పాణ్యంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో దారుణం జరిగింది. వేడివేడిగా ఉన్న సాంబారు గిన్నెలో పడి ఆరేళ్ల బాలుడు మరణించాడు. ఓర్వకల్లు మండలం తిప్పాయపాలెంకు

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 02:39 AM IST
ప్రైవేట్ స్కూల్ లో దారుణం : సాంబారు పాత్రలో పడి LKG విద్యార్థి మృతి

కర్నూలు జిల్లా పాణ్యంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో దారుణం జరిగింది. వేడివేడిగా ఉన్న సాంబారు గిన్నెలో పడి ఆరేళ్ల బాలుడు మరణించాడు. ఓర్వకల్లు మండలం తిప్పాయపాలెంకు

కర్నూలు జిల్లా పాణ్యంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో దారుణం జరిగింది. వేడివేడిగా ఉన్న సాంబారు పాత్రలో పడి ఆరేళ్ల బాలుడు మరణించాడు. ఓర్వకల్లు మండలం తిప్పాయపాలెంకు చెందిన పురుషోత్తమ్ రెడ్డి అనే విద్యార్ధి.. పాణ్యంలోని విజయానికేతన్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. రోజూలాగానే బుధవారం(నవంబర్ 13,2019) మధ్యాహ్నం పిల్లలు భోజనానికి హాస్టల్ కి వచ్చారు. పురుషోత్తమ్ కూడా వచ్చాడు. అంతా క్యూలైన్ లో నిల్చుని ఉన్నారు. ఇంతలో వెనుక నుంచి ఎవరో నెట్టేయడంతో.. ముందున్న పురుషోత్తం పెద్ద సాంబారు పాత్రలో పడిపోయాడు. అక్కడ ఉన్న ఆయా వెంటనే బాబుని బయటకు తీసింది. విషయం స్కూల్ యాజమాన్యానికి చెప్పింది.

యాజమాన్యం బాలుడిని స్థానికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు. ఒళ్లంతా పూర్తిగా కాలిపోవడంతో డాక్టర్లు బాబు ప్రాణాలు కాపాడలేకపోయారు.

కాగా ఈ విషయం బయటికి రాకుండా స్కూల్ యాజమాన్యం ప్రయత్నం చేసింది. గుట్టుచప్పుడు కాకుండా బాబు మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించింది. అయితే విషయం వెలుగులోకి రావడంతో స్కూల్ యాజమాన్యం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. బాబు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

బాలుడి మరణంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘాలు విజయనికేతన్ స్కూల్ యాజమాన్యంపై మండిపడ్డాయి. మేనేజ్ మెంట్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. విద్యార్థి మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాయి. మృతిచెందిన బాలుడి కుటుంబానికి స్కూల్ యాజమాన్యం రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

కాగా, గతంలో కూడా ఒక కార్మికుడు విద్యుత్ షాక్ కి గురై మృతి చెందడం జరిగిందని, ఇదే విషయమై గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని విద్యార్థి సంఘం నాయకులు చెప్పారు. స్కూల్ మొదలైనప్పటి నుంచి యాజమాన్యం కేవలం డబ్బు సంపాదన కోసమే పని చేస్తూ.. విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తుందని మండిపడ్డారు. ఫీజుల మీదున్న శ్రద్ద.. పిల్లల భద్రతపై లేదన్నారు. కనీస ప్రామాణాలు పాటించకుండా స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, స్కూల్ గుర్తింపును రద్దు చేయాలన్నారు. లేదంటే స్కూల్ ముందు భారీ ఆందోళన చేస్తామని అధికారులను హెచ్చరించారు.

స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే బాబు ప్రాణం తీసిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన తోటి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది. తమ పిల్లల భద్రత గురించి టెన్షన్ పడుతున్నారు.