దాగుడుమూతలు ఆడుకుందామని బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేస్‌లో..

దాగుడుమూతలు ఆడుకుందామని బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేస్‌లో..

దాగుడుమూతలు అని చెప్పి బాయ్ ఫ్రెండ్‌ను సూట్ కేస్‌లో జిప్ పెట్టింది ఫ్లోరిడా మహిళ. కేకలు పెట్టి సహాయం కావాలని ఏడుస్తున్నా పట్టించుకోలేదు. పోలీసుల ఎంక్వైరీలో తాము దాగుడుమూతుల ఆడుతుంటే అతని చనిపోయాడని చెప్పింది. మృతిపై కారణాల కోసం సారా బూనె(42) అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

బూనె సోమవారం మధ్యాహ్నం బాయ్ ఫ్రెండ్(టోరెస్) చనిపోయాడంటూ శవాన్ని తీసుకువెళ్లే వాళ్లకు సమాచారం ఇచ్చింది. స్థానికులు ఈ విషయం తెలిసి పోలీసులకు సమాచారం అందించారు. అంతకుముందు రాత్రి ఫుల్లుగా తాగి సరదా కోసం దాగుడుమూతలు ఆడటం మొదలుపెట్టారట. తన ప్రియుడు సూట్ కేస్‌లో దాక్కున్నాడని తెలిసి సరదా కోసం జిప్ పెట్టి పైకి వెళ్లి పడుకుందట. 

తర్వాతి రోజు ఉదయం సూట్ కేస్ ఓపెన్ చేసేసరికి స్పందన లేకుండా పడిఉన్నాడని తెలిపింది. బూనె స్టేట్‌మెంట్ల ఆధారంగా అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వీడియోల్లో సూట్‌కేసులో నుంచి బయటికి వచ్చేందుకు టోరెస్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. శ్వాస ఆడటం లేదని కేకలు పెట్టాడు. 

బూనె కూడా అరుపులు వినిపించేంత దూరంలోనే ఉంది. అంతేకాకుండా గట్టిగా నవ్వుతూ.. నువ్వు నన్ను మోసం చేసినప్పుడు నాక్కూడా అలానే అనిపించింది అని అరిచినట్లు పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.