చెల్లికి మద్యం తాగించి అత్యాచారం చేసి నగ్న ఫొటొలతో బ్లాక్ మెయిల్

వరుసకు అన్న అవుతాడు కదా అని అడగగానే డబ్బు ఇచ్చింది. అదే ఆమె పాలిట శాపమైంది. తీరా.. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆ నీచుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి పిలిచి మరీ మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమెను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి.. వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. హైదరాబాద్ లో ఈ దారుణం జరిగింది.

చెల్లికి మద్యం తాగించి అత్యాచారం చేసి నగ్న ఫొటొలతో బ్లాక్ మెయిల్

brother rape sister and black mail: వరుసకు అన్న అవుతాడు కదా అని అడగగానే డబ్బు ఇచ్చింది. అదే ఆమె పాలిట శాపమైంది. తీరా.. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆ నీచుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి పిలిచి మరీ మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమెను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి.. వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. హైదరాబాద్ లో ఈ దారుణం జరిగింది.

కర్ణాటకకు చెందిన దంపతులు ముగ్గురు కూతుళ్లతో నగరంలో నివసిస్తున్నారు. రెండో అమ్మాయి ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె పిన్ని కుమారులు ఇద్దరు ఫిలింనగర్‌లో ఉంటున్నారు. వీరిలో నిఖిల్(27) ఏదో పనుందని చెప్పి మార్చి 1న యువతి దగ్గర రూ. 50 వేలు తీసుకున్నాడు.

ఆ డబ్బు తిరిగి తీసుకునేందుకు మార్చి2న యువతి నిఖిల్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అతడు మందు కలిపిన కూల్ డ్రింక్ యువతితో తాగించాడు. దీంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలీదు. మత్తు దిగాక ఇంటికి వెళ్లిపోయింది. మూడు రోజుల తర్వాత తన డబ్బు కోసం నిఖిల్ కు ఫోన్ చేస్తే.. అతడు షాక్ ఇచ్చాడు. ఆమె నగ్న ఫోటోలను వాట్సాప్ లో షేర్ చేశాడు. ఆ ఫొటోలు చూసి యువతి ఆందోళనకు గురైంది.

అంతేకాకుండా.. మత్తులో ఉన్నప్పుడు అత్యాచారం కూడా చేశానని.. డబ్బులు అడిగితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. దీంతో.. బాధితురాలు కంగుతింది. ఏం చేయాలో తెలీక మౌనంగా ఉండిపోయింది. అయితే ఆమె అదోలా ఉండటంతో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. ఏం జరిగిందో చెప్పాలని నిలదీశారు. ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.