పెళ్లి చేసుకోమని మహిళ బెదిరింపులు—బీఎస్ఎఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

పెళ్లి చేసుకోమని మహిళ బెదిరింపులు—బీఎస్ఎఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

BSF Constable suicide attempt in adilabad district over molestation : పెళ్లి చేసుకోవాలని  ఓ మహిళ బెదిరించటంతో    బీఎస్ఎఫ్  జవాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం  బెల్సరీ రాంపూర్ కు  చెందిన గెడాం మారుతీ (30) అనే వ్యక్తి బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. మేఘాలయలోని 11వ బెటాలియన్ లో  విధులు నిర్వర్తిస్తున్నాడు.

గత నెలలో సెలవుపై  స్వగ్రామానికి వచ్చాడు. ఆసమయంలో కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు. ఈక్రమంలో గతంలో అతనికి పరిచయం ఉన్న పార్వతీబాయి అనే మహిళ తనను  పెళ్లి చేసుకోమని బంధువు ద్వారా వత్తిడి తీసుకు వచ్చింది.  వద్దని చెప్పే సరికి ఈవిషయమై గ్రామంలో పంచాయతీ పెట్టింది.

ఆ మహిళతో తనకెలాంటి సంబంధం లేదని పెళ్లి చేసుకోనని మారుతీ తేల్చి చెప్పాడు.  ఆమె తన బంధువుతో కలిసి మారుతిపై పోలీసుస్టేషన్ లో కేసు పెడతానంటూ బెదిరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మారుతీ ఆ రోజు రాత్రి ఆరుబయట పడుకుంటానని చెప్పి ట్రాక్టర్ లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

తెల్లవారుఝూమున కుటుంబ సభ్యులు చూడగా అప్పటికే మరణించి ఉన్నాడు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ ఆస్ప్రత్రికి తరలించారు.  మృతుడి సోదరుడు సుదర్శన్ ఫిర్యాదుతో కేసు నమోదు  చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.