కర్ణాటకలో భవనం కూలి ఒకరు మృతి : శిథిలాల కింద 40 మంది 

కర్ణాటకలో భవనం కూలి ఒకరు మృతి : శిథిలాల కింద 40 మంది 

కర్ణాటకలో భవనం కూలి ఒకరు మృతి : శిథిలాల కింద 40 మంది 

బెంగళూరు : కర్ణాటకలో విషాదం నెలకొంది. ధార్వాడ్ లోని కమలేశ్వర్ నగర్ లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీం, పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కున్న 20 మందిని సురక్షితంగా బయటకు తీశారు. 

శిథిలాల కింద 40 మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మిగిలిన వారిని కాపాడేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగనుంది. అధికారులు సహాయక కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
 

×