Hyderabad : పాతబస్తీ మర్డర్ కేసు, అసలు ఏం జరిగింది ? ఎందుకు చంపాల్సి వచ్చింది

నడిరోడ్డుపై కత్తులతో పొడిచి, బండరాయితో మోది అత్యంత  దారుణంగా హమీద్‌ను హత్యచేయడంతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Hyderabad : పాతబస్తీ మర్డర్ కేసు, అసలు ఏం జరిగింది ? ఎందుకు చంపాల్సి వచ్చింది

Murdered At Chandrayangutta : హైదరాబాద్‌ పాతబస్తీ హమీద్ మర్డర్‌ కేసు సంచలనంగా మారింది. పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో పొడిచి, బండరాయితో మోది అత్యంత  దారుణంగా హమీద్‌ను హత్యచేయడంతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కారులో వెళుతున్న హమిద్‌ను వెంబడించిన  దుండగులు…పాతబస్తీ చేరుకోగానే వాహనంలో నుంచి బయటికి లాగి దాడి చేశారు. చేతిలోని మారణాయుధాలతో కొట్టి కొట్టి చంపారు. స్థానికులు గుమిగూడటంతో అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. హమీద్ మనీ ట్రాన్స్ ఫర్ బిజినెస్ చేస్తుండేవాడని పోలీసులు తెలిపారు. వ్యాపారంలో అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయని…వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read More : India Petrol Price : హడలెత్తిస్తున్న పెట్రో ధరలు, హైదరాబాద్‌లో లీటర్ రూ. 109

హమీద్‌.. మిలీనియం ట్రావెల్స్‌, వెస్టన్‌ యూనియన్‌ మనీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన ఆదిల్‌ జాఫ్రీ.. హమీద్‌  స్నేహితుడు. 2019లో దుబాయ్‌ నుంచి వస్తున్న ఆదిల్‌కు.. అక్కడి నుంచి కిలో బంగారాన్ని హైదరాబాద్‌ తీసుకురమ్మని .. హమీద్‌  చెప్పాడు. కిలో బంగారానికి సంబంధించిన డబ్బులు కూడా అప్పట్లో ఆదిల్‌కు ట్రాన్స్ ఫర్‌ చేశాడు. అయితే బంగారం తీసుకువస్తున్న ఆదిల్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నాడని అతనిపై కేసు పెట్టి.. పాస్‌పోర్ట్‌ లాగేసుకున్నారు. అప్పటి నుంచి ఆర్ధిక లావాదేవీల విషయంతో పాటు పాస్‌పోర్ట్ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.

Read More : Infosys: Infosys: ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్.. ఇన్ఫోసిస్‌లో 45వేల ఉద్యోగాలు

తాను మళ్లీ దుబాయ్‌  వెళ్లేందుకు తనకు పాస్‌పోర్ట్ ఇప్పించాలని హమీద్‌పై ఆదిల్‌ ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో అడిగినప్పుడల్లా ఖర్చుల నిమిత్తం ఆదిల్‌కు హమీద్‌ డబ్బులు ఇస్తూనే ఉన్నాడు. అయినా గొడవలు ఆగలేదు. చివరకు హత్యకు దారి తీసింది. బుధవారం సాయంత్రం హమీద్‌ బండ్లగూడ – హాషమాబాద్‌ ప్రాంతంలో కారులో వెళ్తుండగా.. ఆదిల్‌, సయిద్‌ జాఫ్రీ, రయీస్‌ జాఫ్రీ, సాహెదాఫ్రీలు అడ్డగించారు. కత్తులతో విచక్షణారహితంగా నడి రోడ్డుపై హత్యచేసి పరార్‌ అయ్యారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More : Hyper Aadi : 25 నిమిషాలకి అదిరిపోయే రెమ్యునరేషన్ తీసుకున్న హైపర్ ఆది

ఈ కేసులో నాలుగు బృందాలుగా  పోలీసులు నిందితులను గాలిస్తున్నారు. ఈ కేసులో మృతుల అన్నదమ్ముల ప్రమేయంపైన కూడా పోలీసులు అనుమానం వ్యక్తం  చేస్తున్నారు. హమీద్ హత్యతో.. చాంద్రాయణగుట్ట ఎస్సై వెంకటేష్‌ను సస్పెండ్‌ చేశారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌. హత్యకు గురికావడానికి  ముందు హమీద్ చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్‌కు వెళ్లి..తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. అయితే ఆ ఫిర్యాదును ఎస్సై  వెంకటేష్‌  పట్టించుకోలేదు. కొన్ని గంటలకే నడిరోడ్డుపై హమీద్ దారుణహత్య జరిగింది. ఫిర్యాదు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించినట్లు  తేలడంతో ఎస్సై వెంకటేష్‌ను సస్పెండ్‌ చేశారు అంజనీకుమార్.