Pre Planned Bank Robbery : పక్కా ప్లాన్ ప్రకారమే.. బ్యాంకు చోరీ కేసు విచారణలో షాకింగ్ విషయాలు

సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పని చేయకపోవడంతో దుండగుల పని సాఫీగా సాగిపోయిందన్నారు. దీనికి తోడు పక్కనే జాతీయ రహదారి ఉండటం దొంగలకు కలిసొచ్చిందని, చోరీ చేసిన వెంటనే పారిపోయేందుకు వీలు కలిగిందన్నారు.(Pre Planned Bank Robbery)

Pre Planned Bank Robbery : పక్కా ప్లాన్ ప్రకారమే.. బ్యాంకు చోరీ కేసు విచారణలో షాకింగ్ విషయాలు

Pre Planned Bank Robbery

Pre Planned Bank Robbery : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌లో 44వ జాతీయ రహదారిపై ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. సినీ ఫక్కీలో బ్యాంకుకి కన్నమేశారు దొంగలు. అచ్చం జులాయి సినిమా తరహాలో గ్యాస్‌ కట్టర్లతో బ్యాంకు లాకర్‌ను ధ్వంసం చేసిన దొంగలు రూ.4.46 కోట్ల విలువైన సొమ్ము దోచుకెళ్లారు.

చోరీ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే బ్యాంకులో దొంగలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముందు రెక్కీ నిర్వహించారని, ఆ తర్వాత లూటీ చేశారని తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పని చేయకపోవడంతో దుండగుల పని సాఫీగా సాగిపోయిందన్నారు. దీనికి తోడు పక్కనే జాతీయ రహదారి ఉండటం దొంగలకు కలిసొచ్చిందని, చోరీ చేసిన వెంటనే పారిపోయేందుకు వీలు కలిగిందని వివరించారు.

TGB Robbery Case : బ్యాంకులో నగలకు భద్రతేది? ఆందోళనలో బుస్సాపూర్ రైతులు

అంతా పకడ్బందీగా సినీ ఫక్కీలో బ్యాంకులో దొంగతనం జరిగిపోయింది. జులాయి, మోసగాళ్లకు మోసగాడు సినిమా స్టైల్ లో గ్యాస్ కట్టర్లతో వచ్చిన దొంగలు.. ఏకంగా నాలుగున్నర కోట్ల సొమ్ము దోచుకెళ్లారు. దొంగతనం జరిగిన విధానం చూస్తుంటే ఒకటి రెండు రోజులు కాదు చాలా రోజులుగా రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు డౌట్ పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా మెండోర మండలం బుస్సాపూర్ లో జన సామర్ధ్యం తక్కువగా ఉన్న ప్రదేశాన్ని దొంగలు చోరీ చేయడానికి అనువైనదిగా సెలక్ట్ చేసుకున్నారు. బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీకి పాల్పడ్డారు.

ముందుగా బ్యాంక్‌ సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్ సాయంతో బ్యాంక్‌ షట్టర్‌ని కట్ చేసి తెరిచారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమును గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోపలికి చొరబడ్డారు. లాకర్లలో ఉన్న 7 ల‌క్ష‌ల 30 వేల రూపాయ‌ల‌ నగదు, 8.3 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఎత్తుకెళ్లిన బంగారు నగల విలువ 4 కోట్లు ఉంటుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ చోరీ అంతా శనివారం రాత్రి జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. లాకర్ ను కట్ చేసే క్రమంలో నిప్పురవ్వలు పడి లాకర్‌లో దాచిన కొంత నగదు, విలువైన పత్రాలు సైతం కాలి బూడదయ్యాయి.

Bank Robbery : జులాయి సినిమా తరహాలోనే.. గ్యాస్ కట్టర్‌తో బ్యాంకులో భారీ చోరీ

బ్యాంకులోని అలారం సెన్సార్‌ శబ్ధం రాకుండా దాన్ని కూడా ధ్వంసం చేయడం, సీసీ కెమెరాకు సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డును సైతం ఎత్తుకెళ్లడం.. ఇవన్నీ చూస్తుంటే.. పక్కా స్కెచ్ తోనే దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు అంటున్నారు. చిన్న క్లూ కూడా దొరక్కుండా కోట్లు కొల్లగొట్టిన వైనం పోలీసులనే విస్మయానికి గురి చేస్తోంది. బ్యాంకులో చోరీ జరిగిన తీరు గమనిస్తే.. ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఎక్క‌డా అనుమానం రాకుండా, చిన్నపాటి శబ్దం కలగకుండా గ్యాస్ క‌ట్టర్‌తో లాక‌ర్‌ను తెరవడం, ముఖాలు గుర్తు పట్టకుండా మాస్కులతో రావడం, ఒక్క క్లూ కూడా దొరక్కుండా సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం, సీసీ కెమెరాకు సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డును సైతం ఎత్తుకెళ్లడం.. ఇవన్నీ చూస్తుంటే.. అంతా పక్కా సినిమాటిక్ స్టైల్లో చోరీ ఉందని పోలీసులు అంటున్నారు.