Insurance Claim : శవంతో వ్యాపారం… బీమా కోసం డ్రామాలాడిన మాజీ కౌన్సిలర్

హార్ట్‌ఎటాక్‌తో చనిపోయిన భార్య శవంతో బీమా సొమ్ము కొట్టేయాలనుకున్నాడు ఓ మాజీ కౌన్సిలర్ హైదరాబాద్ నుంచి శవాన్ని తీసుకువచ్చే లోపల ఇందుకోసం గొప్ప కధ అల్లాడు. ప్రయాణంలో ఉండగా లారీ వచ్చి ఢీకొట్టటంతో భార్యచినిపోయిందని డ్రామా ఆడాడు.

Insurance Claim : శవంతో వ్యాపారం… బీమా కోసం డ్రామాలాడిన మాజీ కౌన్సిలర్

C Tried To Cheat Insurance Company

Insurance Claim : హార్ట్‌ఎటాక్‌తో చనిపోయిన భార్య శవంతో బీమా సొమ్ము కొట్టేయాలనుకున్నాడు  ఓ మాజీ కౌన్సిలర్ హైదరాబాద్ నుంచి శవాన్ని తీసుకువచ్చే లోపల ఇందుకోసం గొప్ప కధ అల్లాడు.  ప్రయాణంలో ఉండగా లారీ వచ్చి ఢీకొట్టటంతో భార్య చనిపోయిందని డ్రామా ఆడాడు. పోలీసు విచారణలో నిజం ఒప్పుకోవటంతో  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణాజిల్లా  జగ్గయ్యపేటకు చెందిన మాజీ కౌన్సిలర్ కాంతారావు, లీలావతి దంపతులు(55) నెలరోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొంది శనివారం తెల్లవారుఝూమున జగ్గయ్యపేటకు కారులో తిరుగు ప్రయాణమయ్యారు.

జగ్గయ్యపేట శివారులో జాతీయ రహాదారి మీదకు సర్వీసు రోడ్డులోంచి ఎదురుగా ఒక లారీ వేగంగా దూసుకు వచ్చింది.దాన్నితప్పించే క్రమంలో కారును సడెన్ గా ఆపటంతో డ్యాష్ బోర్డుకు కొట్టుకున్నలీలావతి గుండె ఆగి మరణించింది…. అని కాంతారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వెళ్లి పరీశీలించగా అలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. కాంతారావు చెప్పిన ప్రాంతంలో లారీలు ఎదురుగా రోడ్డుమీదకు వచ్చే అవకాశం లేకపోవటంతో పోలీసులు కాంతారావును మరింత లోతుగా ప్రశ్నించారు. దాంతో కాంతారావు తప్పు ఒప్పుకున్నాడు.

వాస్తవానికి…  చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రే అతని భార్య హైదరాబాద్ లో మరణించింది. మృతదేహాన్ని జగ్గయపేటకు తీసుకువచ్చే క్రమంలో అధిక బీమా సొమ్ము కోసం ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించేందుకు కట్టుకధ అల్లి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు ఒప్పుకున్నాడు.

వీఆర్ఓ ద్వారా వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత నిందితుడిపై  క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.