డేటింగ్‌యాప్‌లో యువతిలా అశ్లీల దృశ్యాలను పంపుతూ మోసం చేస్తున్న సీఏ విద్యార్ధి అరెస్ట్

  • Published By: chvmurthy ,Published On : March 14, 2020 / 05:03 AM IST
డేటింగ్‌యాప్‌లో యువతిలా అశ్లీల దృశ్యాలను పంపుతూ మోసం చేస్తున్న సీఏ విద్యార్ధి అరెస్ట్

సోషల్ మీడియాలో దొరికే అమ్మాయిలు ఫోటోలను తీసుకుని వాటితో  డేటింగ్ సైట్ లలో ఫేక్ ఎకౌంట్లు క్రియేట్ చేసి పలువురు యువకులను మోసం చేస్తున్న సీఏ ఫైనల్ ఇయర్ విద్యార్ధిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. 

 విజయనగరం కు చెందిన వెన్నెల  వెంకటేష్ ఇన్‌స్ట్రాగామ్‌ యాప్‌ నుంచి యువతుల ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసి… వీటిని వినియోగించి డేటింగ్‌ యాప్‌ టిండర్‌లో లేడీస్  ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసేవాడు. దీని ఆధారంగా చాటింగ్‌ చేస్తూ తాను మహిళ అని అబద్దం చెపుతూ  యువకులతో  సెక్స్‌ చాట్, న్యూడ్‌ ఫొటోలంటూ చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలెట్టాడు. ఏడాది కాలంగా అనేక మందితో యువతుల మాదిరిగా చాటింగ్‌ చేసి దాదాపు రూ.20 లక్షల వరకు వసూలు చేశాడు.

వెన్నెల వెంకటేష్ కొన్నాళ్లు విజయవాడలో విద్యనభ్యసించాడు. ప్రస్తుతం సీఏ ఫైనల్‌ ఇయర్‌కు రావడంతో హైదరాబాద్‌కు  నివాసం మార్చాడు. యూసుఫ్‌గూడ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీలో ఉంటున్న తన బావ వద్ద నివసిస్తున్నాడు. పరీక్షలు పూర్తయి చార్టెడ్‌ అకౌంటెంట్‌గా మారే లోపే తేలిగ్గా డబ్బు సంపాదించుకోవాలనే దుష్ట ఆలోచన అతని మెదడులో మెదిలింది.

యువకుల వీక్ నెస్ ను క్యాష్ చేసుకోవాలనుకున్నాడు.  ఇంకేముంది యువతుల పేరిట ఎరవేయాలని ప్లాన్‌ వేశాడు. ఇన్‌స్ట్రాగామ్‌ నుంచి అందమైన యువతుల ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకునేవాడు. వీటిని వినియోగించి వేర్వేరు పేర్లతో డేటింగ్‌ యాప్‌ టిండర్‌లో ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసేవాడు.

వాటి ద్వారా అబ్బాయిలతో చాటింగ్ చేసేవాడు. ఆ ఐడీలో కేవలం వాట్సాప్‌ నంబర్‌ మాత్రమే ఉంటుంది… ఫోన్‌ చేసేందుకు అవకాశముండదు. ఆ డేటింగ్‌ సైట్‌లోకి వచ్చేవారు అమ్మాయి ఫొటో చూసి.. చాటింగ్‌ చేసేవారు. చాటింగ్‌ చేసేవారితో వెంకటేష్  మొదట హాయ్‌.. హౌ ఆర్‌ యు అంటూ మాట్లాడుతూ బుట్టలోకి దింపేవాడు. సెక్స్‌ చాట్‌ కావాలంటే రూ. 100 నుంచి రూ. 300,  నగ్న ఫొటోలు కావాలంటే రూ. 300 నుంచి రూ. 500 వరకు డిపాజిట్‌ చేయాలంటూ సూచించేవాడు.

అలా ఓకే చెప్పిన వారికి తన విజయవాడలోని బ్యాంకు ఖాతా నెంబరు ఇచ్చేవాడు.  ఎవరైనా డబ్బు డిపాజిట్ చేసేముందు బ్యాంకు ఖాతా వెరిఫై చేసి మగ పేరుతో ఉందనే అనుమానంతో ఆడా,మగా  అని  అడిగితే బై అంటూ నంబరు   బ్లాక్ చేసేవాడు. దీంతో చాలామంది యువకులు పూర్తిగా ఇతడి వల్లో పడిపోయి డబ్బులు డిపాజిట్ చేసేవారు.  అయితే చాటింగ్‌, నగ్న ఫొటోల వరకు డబ్బులు వసూలు చేసి ఆ తరువాత ఆ నంబర్లను బ్లాక్‌ చేసేవాడు. ఈ విధంగా ఏడాదిలో 20 లక్షల రూపాయలు వసూలు చేశాడు.

వెంకటేష్  రెండు నెలల క్రితం ఇన్ స్టాగ్రామ్ నుంచి ఒక యువతి ఫోటో డౌన్ లోడు చేసి  టిండర్ లో ఫేక్ ప్రోఫైల్ క్రియేట్ చేశాడు.  ఆ యువతికి ఇటీవల పెళ్లి నిశ్చితార్ధం జరిగింది. అయితే ఆమె ఫోటోతో  టిండర్ లో  ప్రోపైల్ క్రియేట్ అయివుండటం అబ్బాయి తరుఫు వారికి తెలిసింది. దాంతో వారు ఎంగేజ్ మెంట్ రద్దు చేసుకున్నారు. దీంతో ఆమె సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది.  ఫిర్యాదు తీసుకున్న పోలీసులు  సాంకేతికంగా దర్యాప్తు చేసి వెంకటేష్ ను అరెస్టు చేశారు.