Visakhapatnam : నగ్నంగా కనిపించాలని చెప్పింది..అలాగే చేశాడు, సీన్ కట్ చేస్తే

కాల్ మీ ఏనీటైమ్ మెసేజ్ పేరిట ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఎవరా అని ఫోన్ చేశాడు. అవతలి నుంచి మంచి కిక్కించే విధంగా అమ్మాయి వాయిస్. సరదాగా చాటింగ్ చేశాడు. మత్తెక్కించే విధంగా ఉండడంతో తొందరలోనే అమ్మాయి వలలో పడిపోయాడు. మధురంగా..వలపుగా మాట్లాడడం...నగ్నంగా వీడియో తీస్తూ మాట్లాడాలని అనే వరకు ఏదో ఊహించేసుకున్నాడు.

Visakhapatnam : నగ్నంగా కనిపించాలని చెప్పింది..అలాగే చేశాడు, సీన్ కట్ చేస్తే

Vishaka

Call Me Anytime  : కాల్ మీ ఏనీటైమ్ మెసేజ్ పేరిట ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఎవరా అని ఫోన్ చేశాడు. అవతలి నుంచి మంచి కిక్కించే విధంగా అమ్మాయి వాయిస్. సరదాగా చాటింగ్ చేశాడు. మత్తెక్కించే విధంగా ఉండడంతో తొందరలోనే అమ్మాయి వలలో పడిపోయాడు. మధురంగా..వలపుగా మాట్లాడడం…నగ్నంగా వీడియో తీస్తూ మాట్లాడాలని అనే వరకు ఏదో ఊహించేసుకున్నాడు. అమ్మాయి చెప్పినట్లుగానే..నగ్నంగా కనిపిస్తూ…వీడియో కాల్స్ మాట్లాడే వాడు. సీన్ కట్ చేస్తే…ఇప్పుడు లబోదిబోమంటూ…పోలీసులను ఆశ్రయించాడు. ‘కాల్ మీ ఎనీటైమ్ మెసేజ్’ పేరిట ఒక్కటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 24 లక్షలు కాజేసిందా ఆ ముఠా. అవును నిజం..విశాఖపట్టణంలో జరిగిన భారీ మోసం ప్రకంపనలు రేపుతోంది.

Read More : Ayodhya Rama : 21కేజీల వెండి ఊయ‌లలో దర్శనమివ్వనున్న అయోధ్య రామయ్య

కాల్ మీ ఎనీ టైమ్..నగ్న వీడియో :-
విశాఖపట్టణంలో కొంతమంది భారీ మోసానికి తెరలేపారు. అమ్మాయిని ఎరగా వేసి యువకులను…మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాల్ మీ ఎనీటైమ్ పేరిట మెసేజ్ రావడంతో విశాఖపట్టణానికి చెందిన ప్రణీత్ అనే వ్యక్తి…ఫోన్స్ చేశాడు. మత్తుగా మాట్లాడడంతో అమ్మాయి ట్రాప్ లో పడిపోయాడు. చివరకు నగ్నంగా కనిపిస్తూ..మాట్లాడాలని చెప్పడంతో అలాగే చేశాడు. ఓ రోజు కాల్ రికార్డింగ్ మొత్తం…వాట్సాప్ కి వీడియో రూపంలో రావడంతో ప్రణీత్ ఖంగుతిన్నాడు.

Read More : Pushpa The Rise Part – 01 : బన్నీ.. ఊరమాస్.. ఉగ్రరూపం..

బెదిరింపులు :-
ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఆ ముఠా పని. తమకు డబ్బులు ఇవ్వాలని లేనిపక్షంలో వీడియో బయటపెడుతామని బెదిరింపులకు పాల్పడిందా ఆ యువతి. సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించింది. ఏమి చేయాలో అతనికి ఏమీ తోచలేదు. వారు అడిగినంత ఇచ్చాడు. మరోసారి ఇలాగే బెదిరించాడు. తన పరువు ఎక్కడ పోతుందోనని వారు అడిగినంత ఇవ్వసాగాడు. కానీ..వారి బెదిరింపులకు ఫుల్ స్టాప్ పడలేదు. యువకుడి నుంచి పలుమార్లు రూ. 24 లక్షలు వసూలు చేసిందా ఆ ముఠా.

Read More : Bhagat Ane Nenu: భగత్ అనే నేను.. ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం

ముఠా గుట్టు రట్టు :-
తాను మోసపోయానని గ్రహించాడు. వీడియో ఎక్కడ వైరల్ అవుతుందోనని భయపడిపోయాడు. ఇక తన వల్ల కాదని..పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఠాకు చెందిన మహిళ, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 3.5 లక్షలు, 8 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మెసేజ్, ఫోన్స్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.