ఎల్బీనగర్ లో కారు బీభత్సం, ఇద్దరికి తీవ్ర గాయాలు

అతివేగంతో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వాహనదారులు మాత్రం మేల్కొనడం లేదు. వారిలో మార్పు రావడం లేదు. అతివేగం, నిర్లక్ష్యంతో జనం ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 04:55 AM IST
ఎల్బీనగర్ లో కారు బీభత్సం, ఇద్దరికి తీవ్ర గాయాలు

అతివేగంతో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వాహనదారులు మాత్రం మేల్కొనడం లేదు. వారిలో మార్పు రావడం లేదు. అతివేగం, నిర్లక్ష్యంతో జనం ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా

అతివేగంతో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వాహనదారులు మాత్రం మేల్కొనడం లేదు. వారిలో మార్పు రావడం లేదు. అతివేగం, నిర్లక్ష్యంతో జనం ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఎల్బీనగర్‌- దిల్‌సుఖ్‌నగర్‌ ప్రధాన రహదారిపై అన్‌లిమిటెడ్‌ మాల్‌ దగ్గర ప్రమాదం జరిగింది.

ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. అక్కడితో ఆగలేదు. ఆ వేగంతోనే కారు పల్టీలు కొట్టి…. మెట్రో డివైడర్‌ను ఢీకొట్టి ఆగింది.

కారు యాక్సిడెంట్ లో గాయపడిన మహిళలను ఓజోన్ ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ మహిళలను వెంకటమ్మ , సత్తెమ్మగా గుర్తించారు. వీరిలో వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కారు అతివేగంగా దూసుకురావడంతోనే యాక్సిడెంట్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, అక్టోబర్ లో ఇదే రూట్‌లో ఓ డాక్టర్ సహా ముగ్గురు ఇలాగే అతివేగంతో గాయపడ్డారు.

కారు నెంబర్ AP9 AB 5436. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ప్రమాదాన్ని కళ్లారా చూసిన స్థానికులు షాక్ కి గురయ్యారు. యాక్సిడెంట్ జరిగిన తీరు వణకుపుట్టించింది. కారు డ్రైవర్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా చర్యలు తీసుకోవాలన్నారు.