ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ : ప్రముఖ కార్ల డీలర్ ఆత్మహత్య

చెన్నైలో ప్రముఖ కార్ల కంపెనీ.. లాన్సన్‌ టొయోటా కు చెందిన డీలర్‌, మహిళా వ్యాపారవేత్త రీటా లంకలింగం (50) ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక నుంగంబాక్కం, కొథారీరోడ్డులో లంకలింగం, రీటా దంపతులు నివసిస్తున్నారు. రీటా ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె భర్త లంకలింగం మురుగేష్ ఇంట్లో లేరు.

  • Published By: chvmurthy ,Published On : September 13, 2019 / 05:39 AM IST
ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ : ప్రముఖ కార్ల డీలర్ ఆత్మహత్య

చెన్నైలో ప్రముఖ కార్ల కంపెనీ.. లాన్సన్‌ టొయోటా కు చెందిన డీలర్‌, మహిళా వ్యాపారవేత్త రీటా లంకలింగం (50) ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక నుంగంబాక్కం, కొథారీరోడ్డులో లంకలింగం, రీటా దంపతులు నివసిస్తున్నారు. రీటా ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె భర్త లంకలింగం మురుగేష్ ఇంట్లో లేరు.

చెన్నైలో ప్రముఖ కార్ల కంపెనీ.. లాన్సన్‌ టొయోటా కు చెందిన డీలర్‌, మహిళా వ్యాపారవేత్త రీటా లంకలింగం (50) ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక నుంగంబాక్కం, కొథారీరోడ్డులో లంకలింగం, రీటా దంపతులు నివసిస్తున్నారు. రీటా ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె భర్త లంకలింగం మురుగేష్ ఇంట్లో లేరు.  లంక లింగం తమిళనాడులో టోయోటా కార్లకు డీలర్‌గా ఉన్న లాన్సన్‌ సంస్థ ఛైర్మన్‌గా, రీటా జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ తమ వ్యాపారాన్ని విస్తరించారు.  కోయంబేడులోని లాన్సన్ టయోటా షోరూంను ఈ దంపతులు నిర్వహిస్తున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా కార్ల అమ్మకాలు తగ్గి నష్టాలు రావడంవల్లే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు.

బుధవారం సెప్టెంబరు 11 రాత్రి ఇంటికి చేరుకున్న రీటా తన గదిలోకి వెళ్లి నిద్రపోయారు. గురువారం  సెప్టెంబరు 12న ఉదయం 11 గంటల వరకు ఆమె తనగదిలోంచి బయటకు రాకపోవటంతో, గదిలో ఎలాంటి అలికిడి వినిపించకపోవడంతో పనిమనిషి నుంగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గది తలుపులు పగులగొట్టి చూడగా రీటా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించారు.  

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్‌ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. ఆమె గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెప్పారు. భర్తతో ఆమెకు గొడవలున్నాయా? లేక కార్ల అమ్మకాలు తగ్గి నష్టాలు ఏర్పడడంతో దిగులు చెంది ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వీరి కుమారుడు చెన్నైలోనే వేరే ప్రాంతంలో నివసిస్తుండగా, కుమార్తె విదేశాల్లో నివసిస్తోంది,