కర్నూలులో మొండెం.. చెన్నైలో చేతులు, కాళ్లు

రోడ్డుప్రమాదం జరిగింది ఒకచోట.. మృతదేహం దొరికింది మరోచోట. యువకుడి కుడికాలు మాత్రమే ఘటనా స్థలంలో దొరికింది. మరి.. మృతదేహం ఎక్కడికి వెళ్లినట్టు.. దాదాపు 19 గంటలపాటు సస్పెన్స్ కు గురిచేసిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అసలేం జరిగిందంటే..

  • Published By: sreehari ,Published On : January 11, 2019 / 09:36 AM IST
కర్నూలులో మొండెం.. చెన్నైలో చేతులు, కాళ్లు

రోడ్డుప్రమాదం జరిగింది ఒకచోట.. మృతదేహం దొరికింది మరోచోట. యువకుడి కుడికాలు మాత్రమే ఘటనా స్థలంలో దొరికింది. మరి.. మృతదేహం ఎక్కడికి వెళ్లినట్టు.. దాదాపు 19 గంటలపాటు సస్పెన్స్ కు గురిచేసిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అసలేం జరిగిందంటే..

  • 420 కిలోమీటర్లు ప్రయాణించిన మృతదేహం.. 

  • బైక్ ను ఢీకొట్టిన కారు.. లారీ ట్రక్కులో పడిన డెడ్ బాడీ

  • మృతుడి బంధువులు రోడ్ రోకో.. మిస్టరీని ఛేదించిన పోలీసులు 

రోడ్డుప్రమాదం జరిగింది ఒకచోట.. మృతదేహం దొరికింది మరోచోట. యువకుడి కుడికాలు మాత్రమే ఘటనా స్థలంలో దొరికింది. మరి.. మృతదేహం ఎక్కడికి వెళ్లినట్టు.. దాదాపు 19 గంటలపాటు సస్పెన్స్ కు గురిచేసిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అసలేం జరిగిందంటే.. చెన్నైలోని తిరువళ్లూరు ప్రాంతంలో బుధవారం రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ఓ యువకుడిని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడి కుడి కాలు చీలిపోయింది. మిగతా యువకుడి మృతదేహం అదృశ్యమైంది. అది ఎక్కడికి వెళ్లిందో అర్థం కాలేదు. ప్రమాదం జరిగిన అనంతరం అక్కడి నుంచి కారు డ్రైవర్ పరారయ్యాడు.

మృతదేహం మిస్సింగ్..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొనే సరికి అక్కడ బైక్, మృతుడి కాలు మాత్రమే కనిపించింది. మృతదేహం కనిపించలేదు. సమీప ప్రాంతాల్లో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలించారు. అయినా ఫలితం లభించలేదు. సీసీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలించారు. ఆ సీసీ దృశ్యాల్లో కారు, బైక్ ఢీకొన్న ప్రదేశంలో సిమెంట్ లారీలు వెళ్లడాన్ని గమనించారు. పోలీసులకు ఇక్కడే అనుమానం వచ్చింది. ఒకవేళ యువకుడి మృతదేహం లారీలో పడి ఉండవచ్చునని భావించారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కారు వేగానికి బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో యువకుడి కాలిభాగం చీలిపోయింది. 

మిగత శరీరం గాల్లోకి ఎగిరి అటుగా వెళ్తున్న లారీలో పడిపోయింది. లారీలో మృతదేహం పడిన విషయాన్ని గమనించని డ్రైవర్ అలాగే వెళ్లిపోయి ఉండొచ్చుని పోలీసులు భావించారు. మరోవైపు మృతుడి బంధువులు రోడ్ రోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. మృతదేహాన్ని గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఏపీ నుంచి తమిళనాడు పోలీసులకు సమాచారం వచ్చింది. ఓ ట్రక్కులో మృతదేహం ఉందని, ఒక కాలు, మొండెం మాత్రమే ఉందని చెప్పారు.

ట్రక్కులో డెడ్ బాడీ లభ్యం..
కర్నూలు వరకు వెళ్లిన లారీ డ్రైవర్ ట్రక్కును గోడౌన్ లో నిలిపాడు. అక్కడ లోడు దించే సమయంలో మృతదేహాన్ని గుర్తించి ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండు ఘటనల్లో మృతిచెందిన వ్యక్తి వివరాలను పోల్చి చూడగా మృతుడు ఒకడేనని పోలీసులు నిర్ధారించారు. అంటే.. చెన్నై నుంచి  మృతదేహం ఏపీ వరకు దాదాపు 420 కిలోమీటర్లు ప్రయాణించింది అన్నమాట. మృతుడు సుధాకర్ గా పోలీసులు గుర్తించారు. బైక్ ను ఢీకొట్టిన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.