Naga Shourya ఫామ్‌హౌస్‌లో పేకాట కేసు.. దందాలో ప్రముఖులు, బడా రాజకీయ నాయకులు

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా నిందితుడు గుత్తా సుమన్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సుమన్ ఫోన్ ను, కాల్

Naga Shourya ఫామ్‌హౌస్‌లో పేకాట కేసు.. దందాలో ప్రముఖులు, బడా రాజకీయ నాయకులు

Naga Shourya Farm House

Naga Shourya : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా నిందితుడు గుత్తా సుమన్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సుమన్ ఫోన్ ను, కాల్ డేటాను పోలీసులు అనలైజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గుత్తా సుమన్ ఈ ఒక్క ఫామ్ హౌజ్ లోనే కాదు నగర శివారులోని వేర్వేరు ఏరియాల్లో వేర్వేరు ఫామ్ హౌజ్ లలో ఇదే దందా నడుపుతున్నాడని సమాచారం.

ఇక ఈ వ్యవహారంలో అందరూ బడా బాబులే ఉన్నట్లుగా తెలుస్తోంది. మినీ కేసినోని తలపించే విధంగా అక్కడ జూదాన్ని చూసి పోలీసులు కంగుతిన్న పరిస్థితి ఉంది. నాగశౌర్య తండ్రికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయంలో సుమన్ తో నాగశౌర్యకున్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Exercise : క్యాన్సర్ రోగులు వ్యాయామాలు చేయటం మంచిదేనా?..

ఫామ్ హౌస్ పేకాట వ్యవహారంలో కొత్తగా బుజ్జి అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. ఈ బుజ్జి మరెవరో కాదు నాగశౌర్యకు బాబాయ్. ఫామ్ హౌస్ లీజ్ అగ్రిమెంట్ నాగశౌర్య తండ్రి రవిశంకర ప్రసాద్ పేరు మీదుంటే, ఫామ్ హౌస్ కార్యకలాపాలన్నీ బాబాయ్ బుజ్జి చూసుకుంటున్నట్లుగా సమాచారం. 5 నెలల క్రితం రవిశంకర్ ప్రసాద్ ఈ ఫామ్ హౌజ్ ను లీజ్ కి తీసుకున్నారు. దీంతో ఆయన పాత్రపై పోలీసులు ఇప్పుడు లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 30మంది ప్రముఖులు పోలీసుల లాకప్ లో ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న మూడు ముక్కలాట వ్యవహారంలో వీఐపీలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. లక్షలు కుమ్మరించి ఆడుతున్న పేకాటలో పొలిటికల్ లీటర్లు కూడా పార్టిసిపేట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య మాత్రమే కాదు ఆయన వెంట ఇంకా చాలామంది పొలిటికల్ లీడర్లు ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తీగ లాగేకొద్దీ ఒక్కో పేరు బయటకు వస్తోంది. ఇప్పటికైతే మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య పేరు బయటకు వచ్చింది. ఇంకా రియల్టర్లు రాజారామ్, మద్దుల ప్రకాశ్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇంకా ఈ పేకాటలో పాల్గొన్న పలువురు నేతలు, రియల్టర్లు ఎవరన్న దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ దందాలో బడాబడా రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు, అంతకుమించిన ప్రముఖులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Triphala Churnam : త్రిఫల చూర్ణం రోజు తీసుకుంటే డాక్టర్ తో పనిలేదా?..

నాగశౌర్య విల్లాపై దాడిచేసిన పోలీసులు పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో నగదు, సెల్‌ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల వద్దనున్న నాగశౌర్య విల్లాపై దాడి చేశారు. సుమన్ అనే వ్యక్తి బర్త్ డే ఫంక్షన్ కోసం ఈ విల్లాను అద్దెకు తీసుకుని దానిని పేకాట స్థావరంగా మార్చినట్టు తెలుస్తోంది.

మొత్తంగా 30 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ. 6.7 లక్షల నగదు, 33 సెల్‌ఫోన్లు, 24 కార్లు, 2 క్యాసినో డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఈ విల్లాను నాగశౌర్య తండ్రి లీజ్ కు తీసుకున్నారు. కాగా, ఫామ్‌హౌస్‌ను పేకాట స్థావరంగా మార్చిన విషయం నాగశౌర్యకు తెలుసా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ భద్రయ్య ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పేకాటపై నిషేధం ఉంది. కానీ కొంతమంది పేకాటరాయుళ్లు అవేవీ పట్టించుకోవట్లేదు. సిటీకి నలువైపులా ఉన్న ఫామ్‌హౌజ్‌లలో పేకాట ఆడేస్తున్నారు. రాజేంద్రనగర్‌ ఏరియా మంచిరేవుల గ్రామంలోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఇలానే ముక్కలు తిప్పుతున్న పేకాట పాపారావులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్‌హ్యాండెడ్‌గా 25 మందిని అదుపులోకి తీసుకున్నారు.