ఇమ్రాన్ ఖాన్ పై బీహార్ కోర్టులో కేసు నమోదు

  • Published By: chvmurthy ,Published On : September 28, 2019 / 12:59 PM IST
ఇమ్రాన్ ఖాన్ పై బీహార్ కోర్టులో కేసు నమోదు

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై బీహార్‌లోని ముజఫర్‌పూర్ లోని జిల్లా కోర్టులో శనివారం 2019, సెప్టెంబరు28న  కేసు నమోదైంది. ముజఫర్‌పూర్‌లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా, ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోదు చేశారు.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సెప్టెంబరు 27, శుక్రవారం నాడు ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అణుయుద్ధం ముప్పుతో సహా  పలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఓజా తన ఫిర్యాదులో ఆరోపించారు.

తన ఫిర్యాదు ఆధారంగా ఇమ్రాన్ ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, పోలీసులను ఆదేశించాలని ఓజా కోర్టును అభ్యర్థించారు. ఆర్టికల్ 370 ను రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఇమ్రాన్ ఖాన్ భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని, దేశంలో అసమ్మతిని సృష్టిస్తాయని ఓజా తన పిటిషన్లో ఆరోపించారు.